త్రివిక్ర‌మ్ భార్య నాట్యం – హాజ‌రైన ప‌వ‌న్ కల్యాణ్‌

శిల్ప‌క‌ళావేదిక‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ భార్య సౌజ‌న్య నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌కు జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌య్యారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి మీనాక్షి కల్యాణం నృత్యరూపకాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు తమన్ కూడా విచ్చేశారు