సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం నిఘా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ అంతు చిక్కడం లేదు. చివరి ఆ ఇబ్బందులు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా తప్పడం లేదు. తెలంగాణలో పాలనలో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని ఇంటలింజెట్స్ రిపోర్ట్స్‌తో అప్రమత్తమైన సీఎం పార్టీని కాపాడుకొనే ప్రయత్నంలో పడ్డారు.
ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేధోమథనం చేశారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా… ఇప్పటి నుంచే చక్కబెట్టుకోవాలని వారికి సూచించారు. మరీ ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు హైదారాబాద్‌లో కాకుండా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రామాల్లో జరిగే అన్ని కార్యక్రమాలు అంటే అవి శుభ, ఆశుభ కార్యక్రమాలు ఏవైన తప్పకుండా హాజరు కావాలని మార్గనిర్దేశం చేశారు.
స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత రెండు సార్లు అధికారంలో ఉన్నామని, వచ్చే సారి కూడా అధికారంలోకి తప్పకుండా తీసుకరావాలనే ఆలోచనలో సీఎం ఉన్నారు. ఇటీవల కాలంలో దుబ్బాకా, జీహెచ్ఎంసీ, హుజురాబాద్‌లో ఘోర ఓటమి చెందడంలో, పథకాల అమలులో సరైన మార్గంలో వెల్లడం లేదని సీఎం నోటీస్‌కి వచ్చాయని తెలుస్తోంది. దీంతో పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలపై సీఎం ప్రత్యేక నిఘ పెట్టారని తెలుస్తోంది. ఇటీవల దాదాపు 50కి పైగా ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఎమ్మెల్యేలపై ప్రత్యేక నిఘా ఉందని తెలుస్తోంది.
2023లో వచ్చే ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ఇప్పటి నుండే వ్యుహాలు రచిస్తున్నారు.