ఓటు వేయని సీఎం కేసీఆర్
రాజకీయ నాయకులకు ఓటు ఓ వజ్రాయుదం. ప్రజలు ఓటు వేస్తేనే ఎమ్మెల్యే అవుతారు, సీఎం అవుతారు. వారు ఎన్నికల్లో నిలబడ్డపుడు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి, ఓటు వేయాలని అభ్యర్థిస్తారు. కానీ వారు ఓటు వేయాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం ఓటు వేయకుండా హాయిగా ఇంట్లో కుర్చన్నారు. కొంత మందికి ఓటు లేకపోవడం వల్ల వేయలేదు. కానీ సాక్షాత్తూ సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఓటు వేయలేదు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటేయలేదు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం కేసీఆర్ మెదక్ లో తన ఓటు హక్కు ఉపయోగించుకోలేదు. మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఓటు హక్కు లేకపోవడంతో ఆయనా ఓటేయలేదు. టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చాక ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం, లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఓటర్ల లిస్టు ప్రకటన నాటికి తిరిగి గెలవకపోవడం వల్ల ఓటేయలేదని తెలిసింది. బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటుకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఓటేయలేదు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇబ్రహీంపట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా నమోదు చేసుకోవడంతో నల్గొండలో ఆయనకు ఓటు హక్కు లేదు.