భంగపడుతూనే ఉన్న పద్మాదేవేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితో ఆమే ఓ సీనియర్ ఎమ్మెల్యే. ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఉద్యమంలో కీలకంగా ఉన్న మెదక్ జిల్లాను ఏకీకృతం చేసింది. స్వరాష్ట్రం కోసం తెగించి కోట్లాడింది. కానీ నాటి నుంచి విధేయతాగా ఉన్నా.. పార్టీ మాత్రం సముచితం స్థానం కల్పించడం లేదు. గతంలో డిఫ్యూటీ స్పీకర్‌గా పీఠం వేసినా… ఆశించిన స్థానం దక్కలేదు. మంత్రివర్గంలో మార్పు అన్నప్పుడల్లా… మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేరు వినిపించేది కానీ ఇప్పుడు ఆ ప్రస్తవానే లేకుండా పోయింది. దీంతో నియోజక వర్గ ప్రజలు, జిల్లా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రామయంపేట, ఇప్పుడు మెదక్ నియోజకవర్గం నుండి ఓటమి అనే మాట లేకుండా విజయమే లక్ష్యంగా దూసుకపోతోంది. ఏనాడు కూడా ప్రజలు విస్మరించలేదు. కానీ కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతలు అనుకుంటున్న ఆమెకు సముచిత స్థానం కల్పించడం లేదు పార్టీ. ఇతర పార్టీల నుంచి వచ్చిన మహిళలకు మంత్రి పదవులు ఇచ్చి… పద్మాదేవేందర్‌రెడ్డిని విస్మరిస్తూనే ఉన్నారు. పార్టీలో నెంబర్ 2, జిల్లా మంత్రిగా ఉన్నా మంత్రి హారీష్ ఎలాంటి రాజకీయ గొడవలు లేకుండా మంచి సత్‌సంభంధాలు ఉన్నప్పటికీ… ఏనాడు కూడా సముచిత స్థానం దక్కలేదు.
మళ్లీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మంత్రి పదవి దక్కుతుందా అనే మాట పక్కన పెడితే … ఆశించిన వారిలో కూడా ఎమ్మెల్యే పేరు లేకుండా పోయింది. ఇందుకు ప్రధాన కారణం సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఎమ్మెల్సీగా ఉండడమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి కవిత సీన్‌లో లేకపోతే పద్మాదేవందర్‌రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండేదంటున్నారు. తెరాస రెండు సార్లు అధికారంలో వచ్చినప్పటికీ పక్కజిల్లా అయిన సిద్ధిపేట, సంగారెడ్డి జరుగుతున్న అభివృద్ధి మెదక్‌లో జరగడం లేదు. ఇందుకు ప్రధాన కారణం నాయకత్వ లోపమే అని అంటున్నారు.
ఏదీ ఏమైనప్పటికీ రాజకీయంగా ఎమ్మెల్యే భంగపడుతూనే ఉన్నారని చెప్పుకోవాలి. మరీ మూడో సారి తెరాస అధికారంలోకి వస్తే అప్పుడు అవకాశాలు ఎలా ఉంటాయనేది కాలమే నిర్ణయించాలి.