26 కోట్ల‌తో జూబ్లీహిల్స్ స్థ‌లం కొన్న హీరో మ‌హేష్‌బాబు

తెలుగు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హైదరాబాద్‌లోని ఖ‌రీదైన ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి స్థ‌లం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో రూ.26 కోట్లతో 1,442 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. ఈ స్థలం యర్రం విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తికి చెందినది. ఈ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూలగొట్టిన విక్రాంత్ రెడ్డి కొత్త భవనం నిర్మించాలని భావించినా, తన నిర్ణయాన్ని మార్చుకుని మహేశ్ బాబుకు స్థలాన్ని అమ్మేశారు. దీనికి సంబంధించిన డీల్ గత నెల 17న కుదిరినట్టు తెలుస్తోంది.