పోర్టబల్‌ మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ ఇన్హేలర్‌ – ఉదజ్‌ విడుదల

భారతదేశంలో మొట్టమొదటి పోర్టబల్‌ మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రం ఉదజ్‌ను నేడు సుప్రసిద్ధ భారతీయ చిత్ర నటి, సోషల్‌ వర్కర్‌ భాగ్యశ్రీ ఆవిష్కరించారు. భావితరపు వ్యక్తిగత వెల్‌నెస్‌ ఉపకరణంను అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల వ్యక్తిగత వినియోగం కోసం ఇది లభ్యమవుతుంది. ఈ యంత్రంలో ప్రత్యేకత ఏమిటంటే ఒకేసారి ఇద్దరు ఇన్హేల్‌ చేసే వీలు దీనిలో ఉంది. ‘‘ఈ మెషీన్‌ వినియోగించిన తరువాత నేను మరింత ఆరోగ్యంగా ఉన్నానన్న భావన కలిగింది. నిర్ధిష్టమైన శారీరక సమస్యలు నయం చేయడం లేదా పరిష్కరించాలని నేను కోరుకోలేదు. కానీ నా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకున్నాను. హోమియోస్టాసిస్‌ అనేది ప్రతిరోజూ ఒక గంట ఇన్హేలర్‌ చేసుకున్న తరువాత పొందే భావాన్ని వివరించడానికి ఒక అత్యుత్తమ పదం అని అనుకుంటున్నాను’’అని ఉదయ్‌ను తొలిసారిగా వినియోగించిన వెంటనే భాగ్యశ్రీ తన అనుభవాలను పంచుకున్నారు.