ఆల్ ఇండియా ర్యాంకర్ని సత్కరించిన కేటీఆర్
నీట్ 2021లో ఆల్ ఇండియాలో మొదటి ర్యాంక్ సాధించిన మినల్ కుటేరీని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఆకాష్ ఇనిస్టిట్యూట్లో ఈ విద్యార్ధి చదువుకున్నారు. ఆకాష్ ఇనిస్టిట్యూట్ అధికారులు మంత్రిని కలిసి వివరాలను వెల్లడించారు. అత్యుత్తమ ర్యాంక్ సాధించడం గొప్ప విషయమని మంత్రి అన్నారు. ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆకాష్ ఇనిస్టిట్యూట్ బృందాన్ని అభినందించారు.