ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
మాజీ మంత్రి ఈటల భూమల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల మెదక్ జిల్లా కలెక్టర్ హారీష్ విలేకరుల సమావేశంలో దాదాపు 70 ఎకరాలకు పైగా భూ కబ్జా చేశారని వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున ప్రెస్ మీట్ పెట్టి తమకున్నది 3 ఎకరాల భూమే… కలెక్టర్ గులాబీ కండువా కప్పుకొని తమపై అసత్య ప్రచారం చేస్తున్నరాని వివరించారు.
రాజకీయ విశ్లేషుకుల ప్రకారం త్వరలో ఈటల వ్యవహారం అతని మెడకు చుట్టుకుంటుదని అంటున్నారు. నిజానాకి అధికారంలో ఉన్నప్పుడు ఈటల భూ కబ్జా చేశారు అనేది జిల్లా కలెక్టర్ వివరించారు. ఆ భూములను తిరిగి బాధితులకు పంచుతామని వెల్లడించారు. అయితే వాస్తవానికి అక్కడి ప్రజలు ఇష్టపూర్వకంగా ఇచ్చారా లేదా.. బలవంతంగా లాక్కున్నారా అనేది తేలాలి. అయితే అచ్చంపేట, హాక్కింపేట, ధరిపల్లి, రామాంతపూర్, గోపాలకృష్ణపురం గ్రామాల పరిధిలో వందల ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. ఆయా గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఆనాటి ప్రభుత్వాలు అసైన్డ్‌ల్యాండ్ కేటాయించింది.
అయితే గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేస్తున్న కాలంలో ఈటల కన్ను ఆ భూములపై పడింది. ఆలస్యం చేయకుండ వెంటనే అక్కడ తన సామ్రాజ్యాన్ని స్థాపించారు. పచ్చటి అడవి భూములను నరికి వేసి జమున హ్యాచరీస్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా హ్యాచరీస్ భవనాలకు దగ్గరలో ఫీడ్ మిల్లు కూడా స్థాపన చేశారు. ఈ విషయంలో స్థానిక ప్రజలు, ఇటు ప్రభుత్వం నుండి వ్యతిరేకత రావడం, పార్టీ నుండి తొలిగించడం, విచారణ చేయడం వంటి పనులు చక చక సాగిపోయాయి. అంతలనే ఉప ఎన్నికలకు వెళ్లడం, దాంట్లో ఈటల విజయకేతనం ఎగరవేశారు.
కాగా ఈటల విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబరిచిన సీఎం కేసీఆర్‌కి తలకొట్టేసిన పనైంది. దీంతో మరల సీఎం ఈటల భూములపై నిఘా పెట్టి ఎలాగైన వాటిని తొలగించి ఆ భూములను తిరిగి లబ్దిదారులకు పంచాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఎలాగు ఈటలకు కేంద్ర ప్రభుత్వం సహాకారం ఉండడం సీఎంకి ఇబ్బందికరంగా మారింది. అలాగే ఇటీవల కాలంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది.
అన్ని విషయాలకు చెక్ పెట్టాలి…. తిరిగి ప్రజల్లో మళ్లీ పాజిటివ్ స్థానం సంపాదించాలంటే ఇదే మంచి తరుణంగా భావిస్తున్నట్లు సమాచారం. ఈటల అసైన్డ్ భూములను కబ్జా చేశారని అధికారింగా నిరూపించి… వాటిని తిరిగి లబ్దిదారులను పంచిపెడితే రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ పాజిటీవ్ పవనాలు విస్తాయనే ఆలోచనలో మెదక్ జిల్లా కలెక్టర్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు…. హుజురాబాద్ ఉప ఎన్నికల ఓటమి, రాష్ట్ర వ్యాప్తంగా తెరాసకు ఉన్న చెడ్డ పేరు రెండు మటుమాయం కావడం తద్యమని ఆలోచనలో భూముల వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.