ఐపీఎల్ ఛాన్స్ వ‌స్తే అస్సులు వ‌దులుకోను

ఐపీఎల్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని.. అందులో ఛాన్స్ వ‌స్తే అస్సలు వ‌దులుకోన‌ని స్పష్టం చేశారు న్యూజిల్యాండ్ సంచ‌ల‌న స్పిన్న‌ర్ అజాజ్ ప‌టేల్‌. భార‌త సంత‌తికి చెందిన ఈ ఆట‌గాడు ఇటీవ‌ల భార‌త్‌తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్లు ప‌డ‌గొట్టి సంచ‌ల‌నం సృష్టించారు. అది కూడా భారత్ గడ్డపై ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. కాగా, కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ లో ఆడడంపై ఈ భారత సంతతి ఆటగాడు తన మనోభావాలు వెల్లడించాడు. ఎంతో ఉద్విగ్నత కలిగించే లీగ్ ఐపీఎల్ అని అభివర్ణించాడు. ఐపీఎల్ లో ఆడడాన్ని గొప్ప అనుభూతిగా భావిస్తానని అజాజ్ పటేల్ వెల్లడించాడు. ఐపీఎల్ చాన్స్ కోసం ప్రతి క్రికెటర్ ఎదురుచూసినట్టే తాను కూడా ఎదురుచూస్తున్నానని వివరించాడు. వేలం ప్రక్రియపై ఎంతో ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు.