కూ యాప్‌తో జతకట్టిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు భాష యొక్క ఉపయోగాన్ని ప్రోత్సహించడానికి భారతదేశ బహుళ భాషా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారం కూ యొక్క హోల్డింగ్ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో మైసూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (CIIL) అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. భారతీయ భాషల అభివృద్ధిని సమన్వయం చేయడానికి భారత ప్రభుత్వంచే స్థాపించబడిన CIIL, యాప్ యొక్క కంటెంట్ నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి, అలాగే యూజర్లకు ఆన్‌లైన్‌లో సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి “కూ” తో కలిసి పని చేయనుంది. ఆన్‌లైన్ బెదిరింపులు, నిందార్ధకమైన మరియు దూరీతమైన వాతావరణం నుండి యూజర్లకు రక్షణ కల్పించడానికి మరియు పారదర్శకమైన ప్లాట్‌ఫారం రూపొందించడానికి ఈ ఒప్పందం సహాయపడుతుంది. ఈ పరస్పర సహకారం ద్వారా భారత రాజ్యాంగంలోని VIII షెడ్యూల్‌లో 22 భాషలలోని అభ్యంతరకరమైనవిగా లేదా సున్నితమైనవిగా పరిగణించబడే పదాలు, పదబంధాలు, సంక్షిప్తాలు మరియు సంక్షిప్త పదాలతో సహా విషయ వ్యక్తీకరణల కార్పస్‌ను CIIL తయారుచేస్తుంది. ప్రతిగా కార్పస్‌ను తయారుచేయడానికి సంబంధిత డేటాను కూ యాప్ షేర్ చేస్తుంది. అలాగే పబ్లిక్ యాక్సెస్ కోసం కార్పస్‌ను హోస్ట్ చేసే ఇంటర్‌ఫేస్‌లను రూపొందించడానికి సాంకేతిక మద్దతు అందిస్తుంది. సోషల్ మీడియాలో భారతీయ భాషల బాధ్యతాయుతమైన వాడుకను అభివృద్ధి చేయడం కోసం ఇది దీర్ఘకాలిక పరస్పర సహకారం. వినియోగదారులకు సురక్షితమైన & ఆకర్షణీయమైన నెట్‌వర్కింగ్ అనుభవాన్ని అనేక భాషల్లో అందించడానికి ఈ ఒప్పందం రెండేళ్లు చెల్లుతుంది.