అన్ అకాడమీలో ఐదు లక్షల మంది బాలికలకు శిక్షోదయ
భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్‌అకాడమీ నేడు దేశవ్యాప్తంగా తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘శిక్షోదయ’ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను వేడుక చేస్తూ, భారతదేశపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆత్మనిర్భర్ సాధించాలనే జాతీయ లక్ష్య సాధన దిశగా అన్‌అకాడమీ యొక్క నిబద్ధతను చాటే కార్యక్రమం శిక్షోదయ్. ఈ కార్యక్రమం ద్వారా అన్‌అకాడమీ ఇప్పుడు ‘బేటీ సంగ్ బులందీ కీ ఓర్’ కు కట్టుబడి ఉంది. దీని ద్వారా భారతదేశ వ్యాప్తంగా 5లక్షల మంది బాలికల విద్యకు తోడ్పడటంతో పాటుగా ప్రతిభావంతులైన విద్యార్ధినిలకు సాధికారితనూ అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యను ఆపేసిన బాలికలు, ప్రస్తుతం పాఠశాలలు మరియు కళాశాలల్లో చేరడంతో పాటుగా ప్రధానస్రవంతి విద్యలో మిళితమయ్యేందుకు తగిన అవకాశాలను సృష్టించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా చేసుకుంది.