మూడో ఫ్రంట్ మళ్లీ తెరమీదకి
కేంద్రంలో అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ గద్దె దింపడమే లక్ష్యంగా ఏకమవుతున్నాయి పలు ప్రాంతీయ పార్టీలు. ఈ మేరకు రంగంలోకి దిగిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పావులు కదుపుతోంది. ఇందుకోసం పక్కా ప్రాణాలిక వేసుకున్నామని… ఆ కార్యచరణ దశగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యుహాంలో భాగంగా గోవాని లక్ష్యంగా చేసుకొని ఆట మొదలుపెట్టారు. గోవా మాజీ ముఖ్యమంత్రి రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరడం మమత అక్కడ గట్టిపట్టు సాధించడానికి మార్గం సులువైందంటున్నారు. ప్రస్తుతం అక్కడ భాజపాని గద్దెదింపి .. దేశ వ్యాప్తంగా ఉన్నా అన్ని ప్రాంతీయ పార్టీలతో మమేకమై… ముందుకు పోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే గతంలో థర్డ్ ఫ్రంట్ అంటూ ఆయా రాష్ట్రాల్లో పర్యటనలు చేసిన తెలంగాణ సీఎంకి ఇది కలిసి వచ్చే అవకాశం. ఇప్పటికే గత కొన్ని రోజులుగా బీజేపీపై యుద్ధం చేస్తానని శపధాలు చేస్తున్నారు. కాగా గతంలో అన్ని ప్రాంతీయ పార్టీలను మమేకం చేయాలని చూసిన ఆయన వల్ల కాలేకపోయింది.దీంతో అట్టకేక్కిన మూడో ఫ్రంట్‌ని ఇప్పుడు దీదీ చేతుల్లోకి తీసుకుంది. టీఎంసీ నేతలు ఇప్పటికే ఆయా ప్రాంతీయ పార్టీలతో టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు స్వయంగా దీదీ వచ్చి కేసీఆర్ సాయం కొరితే కాదనడంలో ఎటువంటి సందేహాం లేదు.
మూడో ఫ్రంట్ గతంలోలాగానే మూలకి పడుతుందా…లేక దీదీ చక్కబెడుతుందా అనేది చూడాలి.