పీకే టీంతో కేసీఆర్ మీటింగ్‌

గ‌త కొన్ని రోజులుగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను చాలా ద‌గ్గ‌ర‌గా ఫాలో చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. గ‌తంలో త‌న స్వంత మ‌నుషుల‌ను న‌మ్మి వ‌దిలిస్తే ఆశించిన ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయారు అని ఆలోచ‌న‌ల‌తో ఉన్న సీఎం త‌న స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఎవ‌రిని న‌మ్మ‌కుండా త‌నే ఒంటి చేతో ప‌నులు చ‌క్క‌బెట్టే ప్ర‌య‌త్నంతో నిమ్మ‌గ్నమైనారు.

ఉన్న‌ది ఉన్న‌ట్లుగా, కుండ బ‌ద్ద‌లు కొట్టే….లాగా చెప్పి, వెంట‌నే రాజ‌కీయ స్వ‌రూపాన్ని మార్చే వ్య‌క్తిగా పేరొందిన ప్ర‌శాంత్ కిషోర్ (పీకే) టీంతో ఇప్పుడు కేసీఆర్ క‌లిసి ప‌ని చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ సమేర‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో పీకే టీంతో స‌మావేశ‌మై…. రాష్ట్రంలో కొన‌సాగుతున్న ఆయా ప‌థ‌కాలు తీరుతెన్నల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

గ‌త ఏడేళ్లుగా ప్ర‌జ‌లు ఈ ప‌థ‌కాల‌పై సంతృప్తిగా ఉన్న‌రా లేదా అనే అంశంపై త్వ‌ర‌లో స‌ర్వే నిర్వ‌హించాల‌ని… భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే ఎలాంటి వ్యుహాల‌ను అమ‌లు చేయాల‌ని అనే అంశాల‌పై చ‌ర్చించారు.

అయితే ఇటీవ‌ల తెలంగాణలో కొత్త‌గా పార్టీ స్థాపించిన ఏపీ సీఎం చెల్లెలు ష‌ర్మిలతో కూడా పీకే టీం స‌మావేశ‌మైనారు. కాగా ఈ రెండు పార్టీలలో ఏ పార్టీకి పీకే టీం ప‌ని చేస్తుందో వారు పెద‌వి విప్పితే కానీ తెలియ‌దు.