పిల్లల చానల్ POGO ఇప్పుడు తెలుగు భాషలో


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రాంతీయ ఉనికి విస్తరించుకుంటున్న స్థానిక కార్టూన్ చానల్


కొత్తగా తెలుగు భాష తో POGO – WarnerMedia కిడ్స్ ఎంటర్టెయిన్మెంట్ టీవీ చానల్ – భారతదేశంలో మరెన్నో ఇళ్ళను చేరుకోనుంది. ఈ అదనపు ఫీడ్ తో 100% స్వదేశీ యానిమేషన్ కోసం దేశంలోని ప్రముఖ బ్రాండ్ దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో తన వీక్షకుల సంఖ్యను పెంచుకోనుంది.
POGO ఫ్యాన్ – ఫస్ట్ వ్యూహంలో స్థానిక కంటెంట్ అనేది కీలకంగా ఉంది. దీని ఇటీవలి లోకల్ ఒరిజినల్స్
వీక్షకుల నుంచి చక్కటి స్పందన పొందాయి. ఇటీవలి కాలంలో చానల్ కు సంబంధించి అత్యంత విజయవంతమైన కామెడీ సిరీస్ లలో ఒకటైన ‘Titoo – Har Jawaab Ka Sawal Hu’ బాలీవుడ్ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న ఒరిజినల్ ‘Smashing Simmba’ మరియు ‘Chhota Bheem’ వంటి కార్టూన్స్ ను చిన్నారులు, కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందించారు. ఎంతో వినోదాత్మకంగా ఉండే ‘Bandhbudh aur Budbak’ కూడా ఇప్పుడు తెలుగులో లభ్యమవుతుంది.
ఈ ఆవిష్కరణ గురించి Cartoon Network అండ్ POGO సౌతేషియా నెట్వర్క్ హెడ్ అభిషేక్ దత్తా
మాట్లాడుతూ, ‘‘POGO తెలుగు భాషా ఫీడ్ రూపకల్పన అనేది మా చిన్నారి వీక్షకుల కోసం స్థానిక యానిమేషన్ కంటెంట్ ను అందిస్తామనే మా కట్టుబాటును నెరవేర్చుకోవడంలో ఓ అడుగు. ప్రపంచస్థాయి యానిమేషన్ లను, కథలను భారతదేశంలో మరెందరికో అందించే అవకాశం ఇది’’ అని అన్నారు.

POGO ఇప్పటికే తమిళం మరియు హిందీ భాష లలో అందుబాటులో ఉంది.


For more information, visit @PogoTVIndia on Facebook.