మరో గుణపాఠం నేర్చుకోవాలా?
కరనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఓ మంచి గుణపాఠం నేర్చుకున్నారు అనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా భారతదేశంలో శుభ్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. రేండేళ్లు గడవకముందే మరో గుణపాఠం నేర్చుకోవాడని అందరూ సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కోవిడ్ కొత్త వేరియంట్ వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొంది. ముందు జాగ్రత్తవల్లే న్యూయర్ నగరంలో ముదస్తు లాక్‌డౌన్ విధించింది అమెరిక ప్రభుత్వం. అయితే అజాగ్రత్త వహిస్తే, టీకాలు వేసుకున్నవారికి సైతం మళ్ళీ కరోనా వచ్చే రిస్క్ ఒమిక్రాన్‌లో ఎక్కువేనంటున్నారంటే ఎంతటి జాగ్రత్త అవసరమో అర్థం చేసుకోవచ్చు. శతకోటి టీకా డోసుల సంబరం తర్వాత పాలకుల్లోనూ, కేసులు తగ్గాయి లెమ్మని ప్రజల్లోనూ అలక్ష్యం పెరిగినమాట నిజం. గత మూడు నెలల్ని పోలిస్తే, దేశంలో పదుల శాతంలో తగ్గిన టీకా డోసుల గణాంకాలే అందుకు నిదర్శనం. 80 శాతం మందికి పైగా వయోజనులకు ఒక డోసైనా అందింది కానీ, మళ్ళీ రెండో డోసుకు వస్తున్నవాళ్ళు తక్కువే. ఒక్క యూపీలోనే కోటి మందికి పైగా రెండో డోసు తీసుకోలేదు. అందుకే, కొత్త కోవిడ్ వేరియంట్ వల్ల సమీప భవిష్యత్తులో భారత్ సహా ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై దుష్ప్రభావం తప్పకపోవచ్చు. మోర్గాన్ స్టాన్లీ తాజా పరిశోధన ఆ మాటే చెప్పింది. పరిస్థితి తీవ్రమైతే లాక్డౌన్ల బెడదా లేకపోలేదంది. ఇక, దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు పర్యటన సహా చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రపంచ శ్రేణి క్రీడోత్సవాలకూ ఇక్కట్లు తప్పేలా లేవు.
వైరస్ జన్యునిర్మాణాన్ని కనిపెట్టే జన్యు అనుక్రమణం కీలకమని ఒమిక్రాన్ మరోసారి గుర్తు చేసింది. జన్యు అనుక్రమణ శోధనలపై దక్షిణాఫ్రికా భారీగా పెట్టుబడి పెట్టడం వల్లే ఒమిక్రాన్‌ను కనిపెట్టడం, తక్షణమే ప్రపంచాన్ని అప్రమత్తం చేసి, చర్యలు చేపట్టడం సాధ్యమైంది. అవసరమైతే కొత్త వైరస్ రూపానికి తగ్గట్టు టీకాల్ని ఆధునికీకరించడానికీ ఈ శోధనలు కీలకం. కానీ ఇలా శోధించి, ఫలితాలను పారదర్శకంగా బయటపెట్టినందుకు ప్రయాణాలపై నిషేధం లాంటి ఇక్కట్లకు అవి గురి అవుతున్నాయి. అందుకే, ఆర్థికంగా తమను దెబ్బతీసే ప్రయాణ నిషేధాలు ఎత్తివేయాలనీ, తమ లాంటి దేశాలకు ప్రపంచస్థాయిలో పరిహారం చెల్లించాలన్న దక్షిణాఫ్రికా వాదన సబబే అనిపిస్తుంది.
మరోపక్క అందరికీ టీకాలందితే తప్ప, ఏ ఒక్కరమూ సురక్షితం కాదనేది ప్రాథమిక సూత్రం. కానీ, సంపన్న దేశాలు ఖర్చు కాని టీకాలను తమ దగ్గర పోగేసుకుంటున్నాయే తప్ప, అల్పాదాయ దేశాలకు అందించడం లేదు. సంపన్నదేశాల్లో 60 శాతం మందికి టీకా పూర్తయితే, అల్పాదాయ దేశాల్లో కేవలం 3 శాతానికే టీకాలు అందడం శోచనీయం. మూడో డోసుకు ఆరాటపడుతున్న సంపన్న దేశాలు, ఆఫ్రికా లాంటి వాటికి అవసరమైన టీకాలే అందించలేదు. ఇది నైతికంగా తప్పే కాక, టీకాను సైతం తట్టుకొనే వైరస్ రూపొందే ముప్పుంది. అందుకే, వాడని టీకాలను వర్ధమాన దేశాలకు ముందుగా పంపే సమర్థ వ్యవస్థను సంపన్న దేశాలు అభివృద్ధి చేసుకోవడం అవసరం. భారత్ సైతం టీకా మైత్రి కింద అంతర్జాతీయ వేదిక కోవాక్స్‌కు మరిన్ని టీకాలను సరఫరా చేయాలి.
ఏదిఏమైన ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే…. మరో మరణం మృదంగం చూడాల్సిందే