యాసంగి వరి కొనుగొలు కిరికిరి ఎందుకు
మెదక్ జిల్లా యువ రైతు
రాజశేఖర్ రెడ్డి
భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యకూమరి వరకు అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో అనేక పంటలు పండిస్తున్నారు. కానీ ఏ రాష్ట్రంలో కూడా పంటల కొనుగోలు విషయంలో ఎక్కడా ఇబ్బంది రావడం లేదు. కానీ ఒక్క తెలంగాణలో మాత్రమే వానకాలం పంటలు పక్కన బెట్టి యాసంగి పంట కొనుగోలు విషయంలో కేంద్రంతో కిరికిరి పెట్టుకుంటున్నారు సీఎం కేసీఆర్.
అయితే ఇందులో ఉన్న నిజం మాత్రం సామాన్య ప్రజలకు తెలవాల్సిందే. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకూ అనేక అప్పుల రొంపిలో పడింది. దీంతో పాలన పరంగా అనేక ఇబ్బందులు ఎదరవుతున్నాయి. మరో వైపు రాజకీయంగా కూడా అధికార పార్టీ బలహీన పడుతోందనే చెప్పుకోవాలి. ఇలాంటి సమయంలో మంచి సమయస్పూర్తితో ఆలోచించకుంటే ఇబ్బందులు తప్పవు మరీ అధికార పార్టీకి అందుకే ఒక అంశాన్ని పట్టుకొని… తెలంగాణలో ఎదుగుతున్న పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టే విధంగా చేయాలనేది ముఖ్య ఉద్దేశ్యమనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే రైతుల ముందు కేంద్రాన్ని దోషిగా చూపించాలనే ఒక భయంకరమైన ప్లాన్ వేశారు. అందుకే ప్రతి ప్రెస్ మీట్‌లో భాజపాని లక్ష్యంగా చేసుకొని మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు.
వాస్తవానికి రైతులు మీద ప్రేమ నా ఒక్కడికే ఉందని… ఆ పేటేంట్ హక్కలు తనకే ఉన్నాయని బల్లగుద్ది మరీ చెప్పకుంటారు సీఎం కేసీఆర్. ఆలాంటి ఆయన రైతులకు కష్టం వస్తే ప్రత్యేక నిధితో యాసంగి పంటను కొనుగొలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. రైతుల మీద అంత ప్రేమ ఉంటే… అనవసరమైన సచివాలయ నిర్మాణం చేపట్టేబదులు ఆ డబ్బులు పంట కొనుగోలు ప్రత్యేకంగా కేటాయించాలి. అంతేకానీ కేంద్రం కొనలేదు… మీరు యాసంగి పంట వేయవద్దు అని ప్రజలకు చెప్పడంలో ఏ అంతార్యం ఉందో బహాటంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
సీఎం చెప్పినట్లు యాసంగి వరి పంట వేయవద్దు… మీ ఇష్టం అంటే ఎలా… ప్రజలు దీన్ని దేనికి సంకేతంగా తీసుకోవాలి. గతంలో లాగా మళ్లీ వ్యాపారుల వద్దకు తీసుకెళ్లాలా…. అలా మీరు ఆయా రైస్‌మిల్లు యాజమాన్యంతో మీరేమైన ఒప్పదం కుదుర్చుకున్నారా. మీరు చెప్పినట్లుగా వరి వేయకుంటే…. వేరే పంటల మీద ప్రజలకు సరైన అవగాహన లేదు. ఒక వేళా వరి వేసి వ్యాపారులకు అమ్మకుంటే… భవిష్యత్తులో వరికి డిమాండ్ సష్టృంచి వ్యాపారులకు లబ్ధిచేకురే ప్రయత్నం ఏర్పడుతుంది. రైతులు సీఎం వైఖరిని పరిశీలించి పంటలు వేయాలి.