కిషన్‌రెడ్డి ఓ రండ అన్నా సీఎం – బగ్గుమంటున్న భాజపా
- సహనం కోల్పోతున్న సీఎం కేసీఆర్
- భాజపానే లక్ష్యంగా మాటల తూటాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన సహనం కోల్పోతున్నారా అంటే… అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలే మాటల గారడీ చేసే ఆయన మాట తప్పి మాట్లాడుతున్నారని మండిపడుతన్నారు బీజేపీ నాయకులు.
వరికొనుకోనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని తప్పుబడుతూ… ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన సమావేశం జరిగింది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కిషన్‌రెడ్డి ఓ రండా వ్యవహిరిస్తున్నారని మండిపడ్డారు. సిపాయిలుగా పోరాటం చేయాల్సిన ఆయన రైతులకు అన్యాయం చేసేలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన తర్వాత స్తభత్తగా ఉన్న సీఎం ఒక్కసారిగా మళ్లీ భాజాపా లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇంకా యాసంగి పంటకు తుకం కూడా పోయని సమయంలో వడ్లు కొనాలని ఇప్పటి నుంచే పట్టుపట్టడంలో ఉన్న అంతార్యం ఎంటో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. వర్షకాలంలో పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేదు. కానీ యాసంగి పంట మీద చూపిస్తున్న ప్రేమ… అంతా రాజకీయ క్రీడగా అభివర్ణిస్తు్నారు విశ్లేషకులు.
మంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం చేసిన వ్యాఖ్యలను విరమించుకోవాలని భాజపా నాయకులు డిమాండ్ చేస్తున్నారు.