ముఖ్య‌మంత్రి రాజీనామా

దేశంలో ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర రాజ‌కీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి. గ‌త కొన్ని నెల‌లు పంజాబ్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ ర‌స‌వ‌త్తరానికి ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. సీఎల్పీ భేటీకి ముందు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ త‌న రాజీనామాను గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు. సీఎంతో పాటు మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు. 2017 మార్చి 16న సీఎంగా అమరీందర్‌ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో విబేధాలు కొనసాగుతున్నాయి. రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉదయం సోనియాగాంధీతో మాట్లాడా. నమ్మకం లేని చోట నేను ఉండను. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టారు. ఇది నాకు అవమానకరంగా అనిపించింది. ప్రభుత్వాన్ని నడపలేనని అనుకున్నట్లున్నారు. ఎవరి మీద నమ్మకముంటే వారిని సీఎం చేసుకోమని చెప్పా’ అని తెలిపారు.