గుడికి వస్తే విడాకులు గొడవ ఏంటీ?
నటి సమంత మీడియా ప్రతినిధులపై మండిపడ్డారు. హీరో నాగార్జున తనయుడు నాగచైతన్య సమంతను వివాహాం చేసుకున్న సంగతి అందరికి తెలుసు. అయితే గత కొన్ని రోజులుగా వారి మద్య విభేధాలు వచ్చాయని, త్వరలో విడాకులు తీసుకుంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇవాళ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన సమంతకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. త్వరలో మీరు నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నారని అని ఓ విలేకరి ప్రశ్నించగా అతనిపై మండిపడింది. గుడికి వస్తే విడాకుల గొడవ ఏంటీ అని ప్రశ్నించింది.