తాలిబన్ల వలలో అప్గానిస్తాన్
అప్గానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాలను తమ పాగ వేసిన తాలిబన్లు చివరకు దేశ రాజధాని కాబుల్ చేరుకున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం తాలిబన్ల చేతిలోకి దేశం వెల్లిపోయిందని అధ్యక్షుడు అష్రాఫ్‌ఘనీ ప్రకటించారు. దేశంలో మరికొంత మంది అమరులు కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక దేశ ప్రజల హృదయాలను వాళ్లు గెలవాల్సి ఉందని పేర్కొన్నారు.
మరోపక్క దేశ ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని పొరుగు దేశాల బాట పట్టారు. ఇప్పటికే భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీకి దాదాపు 120 మంది చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానాలు కూడా ఆప్గాన్ నుండి నడిపించాలని ఎయిర్ ఇండియా అనుకుంటోంది.
ఇది ఇలా ఉంటే దేశంలో పాత రోజులు వస్తాయో ఎమో అని అని భయపడుతున్నారు ఆ దేశ ప్రజలు. 12 సంవత్సరాలు దాటిన మహిళలలు చదవుకోకుండా ఆంక్షలు విధిస్తారని వణికిపోతున్నారు. మహిళలపై తీవ్రమైన ఆంక్షాలు పెడుతారని వణికిపోతున్నారు.