ధ‌రిప‌ల్లిలో మ‌రో సినిమా షూటింగ్‌

ధ‌రిప‌ల్లి గ్రామం సినిమా షూటింగ్‌ల‌కు అడ్డాగా మారింది. ఇప్ప‌టికే అస‌లేం జ‌రిగింది, విరాట‌ప‌ర్వంతో పాటు ప‌లు సినిమా చిత్రీక‌ర‌ణ‌లు జ‌రిగాయి. మ‌రి కొన్ని రోజుల్లో ఇవి విడుద‌ల‌కు సిద్దంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ నేప‌థ్యంలో జ‌రిగే సినిమా చిత్రీక‌ర‌ణ ధ‌రిప‌ల్లిలో పూర్తిస్థాయిలో నిర్మాణం జ‌ర‌గ‌నుంద‌ని స్థానికులు చెబుతున్నారు. నిర్మాణంలో భాగంగా పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ద్ద ప‌లు సెట్టింగ్‌లు వేశారు. దీంతో గ్రామంలో సినిమా హ‌డ‌వుడి మొద‌లైంది.