చంద్రబాబు రాజ్యానికి అనామక చక్రవర్తి
తెలుగుదేశం పార్టీ. ఈ పేరు తెలియని వారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండలేరు అనడంలో అతియోశక్తి లేదు. ఆనాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే అధికారంలో వచ్చి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ప్రజలకు కావాల్సిన పథకాలను, పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి మరో చరిత్ర సృష్టించారు. అనంతరం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ అధినేతగా మారారు. ఆ తెర వెనుక రాజకీయాలు ఇక్కడ చర్చిచడం అర్థ రహితం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పేరు సంపాధించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి నాంది వేసింది కూడా చంద్రబాబు ఆలోచనలే. కానీ ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో పార్టీ కనుమరైందని చెప్పుకోవాలి అంటే…. చివరికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరు కూడా తెలంగాణలో తెలియనంతగా. నిజంగా ఇది ఏ ఒక్కరూ కూడా జీర్ణించుకోలేని విషయం అని చెప్పుకోవడంలో మోహమాటం లేదు. ఎందుకంటే పార్టీని ముందుకు తీసుకవెళ్లే నాయకుడు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. అది మంచిలోనైనా…. చెడులోనైనా. కానీ చంద్రబాబు నాయుడు విస్తరింప జేసిన రాజ్యంలో అనామక చక్రవర్తి ని నియమించారని సీనియర్ రాజకీయ నాయకులు, సీనియర్ విలేకరులు అంటున్నారు.
ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎల్. రమణ రాజీనామా చేశారు. అయితే అనివార్యంగా పార్టీ అధ్యక్షుడిగా మరొకరిని నియమించే అవశ్యకత ఏర్పడింది. కానీ ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ బలాన్ని చేకూర్చే పనిలో విఫలమైనట్టు తెలుస్తోంది. గతంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు బక్కని నర్సింహులు.
ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకు, రాష్ట్ర ప్రజలకు కూడా ఇతని పేరు. ఫేస్ కూడా ఎవ్వరికీ తెలియడం లేదని సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు నెటిజన్లు. తెలంగాణ ఇక తెలుగుదేశం పార్టీ శకం ముగిసిందని అంటున్నారు. అయితే ఈ కొత్త అధ్యక్షుడు ఎలాంటి మార్పులు తీసువస్తారో వేచి చూడాలి మరీ. ఏదీ ఏమైన చంద్రబాబు నిర్ణయం తప్పే అంటున్నారు సొంత పార్టీ నేతలు.