ఇంటి ప‌ని మ‌నుషుల‌కు మేయ‌ర్ చేసిన ప‌ని

హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తోంద‌ని విమర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే అధికారం ఉంద‌ని ఓ మండ‌ల అధికారిపై త‌న జులం ప్ర‌ద‌ర్శించింది. కాగా తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకుంది మేయ‌ర్‌. తమ ఇంటిలో పని చేసే వారి కుటుంబీకులను నియమించేందుకు ఔట్‌ సోర్సింగ్‌పై పని చేస్తున్న ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులను తొలగించారంటూ సీపీఎం నగర శాఖ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ నగరశాఖ కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌ బాధితులతో కలిసి కమిషనర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంజగుట్ట ప్రాంతంలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు వి.భారతి, ఎల్‌.రమాదేవి, ఎస్‌ఎఫ్‌ఏ (శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌) సాయిబాబాలను తొలగించి మేయర్‌ ఇంట్లో పని చేసే వారి కుటుంబ సభ్యులను నియమిస్తూ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ జూన్‌ 22న ఉత్తర్వులు జారీ చేసినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.