నీట మునిగిన మాసాయిపేట రైల్వే అండ‌ర్ బ్రిడ్జ్‌

ఫోటోలు : కృష్ణ‌

ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు మా రైల్వే అండ‌ర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నీట మునిగింది. గ‌త రెండు సంవ‌త్స‌రాలు సాగుతున్న ప‌నులు ఇప్ప‌టికీ పూర్తి కాలేదు. దీంతో మాసాయిపేట‌తో పాటు, ధ‌రిప‌ల్లి, అచ్చంపేట‌, హ‌క్కీంపేట గ్రామ‌స్తులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అంతే కాకుండా ఈ ర‌హ‌దారి జిల్లా కేంద్ర‌మైన మెద‌క్ ప‌ట్టణానికి కూడా ద‌గ్గ‌ర కావ‌డంతో అనేక మంది నిత్యం ఈ దారివెంట‌నే ప్ర‌యాణిస్తున్నారు. గ‌త కొన్ని రోజుల క్రిత‌మే బ్రిడ్జ్ ప‌నులు పూర్త‌యినా… అక్క‌డ నీరు చేరితే బ‌య‌ట‌కు పంపేలా ఏర్పాటు చేస్తున్నా ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతుండ‌డంతో అనేక ఇబ్బుందులు ప‌డుతున్నారు. కాగా మూడు రోజుల క్రితం కురిసిన భారీ వ‌ర్షాల‌కు రైల్వే అండ‌ర్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగింది. దీంతో ప‌నులు చేయ‌డానికి మ‌రింత ఆలస్యం కానుంది. ఇప్ప‌టికైన అధికారులు యుద్ద ప్రాతిపదిక‌న ప‌నులు పూర్తి చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.