వాళ్లు శృంగారం చేస్తే మంచాలు విరుగుతాయంటా

ఒలంపిక్స్ క్రీడ‌లు అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా అందిర‌కీ ఆసక్తే. అయితే ఈ సారి ఆ ఆట‌లు ప్రారంభం కాక‌ముందే ఓ వార్త ప్ర‌పంచాన్ని చుట్టేసింది. జూలై నెల చివరి వారంలో ప్రారంభంకానున్న విశ్వ క్రీడలకు ప్రపంచ అథ్లెట్లు సంసిద్ధమవుతున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఒలంపిక్స్‌ నిర్వహణ కత్తి మీద సాములా మారిందని చెప్పాలి. ఈ క్రమంలో అథ్లెట్ల మధ్య శృంగార కట్టడికి నిర్వాహకులు వినూత్న ఆలోచనను అమలు చేశారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులు రొమాన్స్‌ లో పాల్గొనకుండా ఒలింపిక్‌ గ్రామంలోని వా‍ళ్లు బస చేస్తున్న గదుల్లో విచిత్రమైన బెడ్లను ఏర్పాటు చేశారు.
అట్టలతో తయారు చేసిన మంచాలను క్రిడాకారుల గదులో ఉంచారు. దీనివల్ల ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనే వీలుండదని అని వారి యోచన. ఒలింపిక్స్‌ ముగిశాక వీటిని రీసైక్లింగ్‌ చేసి కాగితపు ఉత్పత్తులుగా మార్చనున్నారు. క్రీడాకారుల మధ్య భౌతిక దూరం ఉండేందుక ఈ చర్యలు చేపట్టారు. జూలై24 న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్ల బస కోసం 18,000 పడకలు అవసరం కాగా, పారా ఒలంపిక్స్‌కు 8,000 పడకలు మాత్రమే అవసరం అయ్యాయి. ప్రస్తుతం ఈ బెడ్ల ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి వైరల్‌ గా మారి హల్‌ చల్‌ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇవి గరిష్టంగా 200 కిలోల బరువు వరకు ఆపగలవని, యాంటీ సెక్స్‌ బెడ్స్‌ కథనాలను తోసిపుచ్చుతున్నారు ఒలింపిక్‌ నిర్వాహకులు.