హుజురాబాద్ పోటీ నుంచి అందుకే తప్పుకుందా షర్మిల ?
రాష్ట్ర రాజకీయాల్లో రసవత్తరం సృష్టిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికలపై కీలక ప్రకటన చేసింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల. ఇప్పటికే అక్కడ గెలవాలన్న పట్టుదలతో తెరాస, భాజపా, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా తెరాస, భాజపా ఆత్మగౌరవం కింది ఈ ఎన్నికలను తీసుకున్నాయి. అయితే ఇటీవల తెలంగాణలో స్థాపించారు వైఎస్ షర్మిల. అయితే పార్టీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికలు ఇవి. కాగా ఈ పోటీలో తాము పోటీ చేయడం లేదు అని, ఈ ఎన్నికల ద్వారా సాధించేది ఏమి లేదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు ఒకరిపై ఒకరు అక్కసు వెల్లగక్కునే ఎన్నికలే కానీ ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికలు కావాన్నారు.