నిర్లక్ష్యం వహిస్తే షుగర్ ముప్పే : డా. శ్రావణి తాన్న
డాక్టర్.శ్రావణి తన్నా,
కన్సల్టెంట్ ఎండోక్రినాలజీ,
కిమ్స్ ఐకాన్, వైజాగ్.
కోవిడ్ నుండి కోలకున్నా కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో మధుమేహం కూడా ఒకటి. డయాబెటిస్ (మధుమేహం, లేదా షుగర్) వ్యాధి ఇప్పుడు చాలా తరుచూగా వింటున్నాం. ఇందులో ఎక్కువుగా చూసేది టైప్2 డయాబెటిస్. ఇది ఎక్కువుగా పెద్దవారిలో కనిపిస్తుంది. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం వలన కూడా ఈ వ్యాధి వస్తుంది. టైప్1 డయాబెటిస్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ లోపం వలన వస్తుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది.
ఇన్సులిన్ అనే హార్మోన్ మన శరీరంలో ఉండే పాంక్రియాస్ నుండి వస్తుంది. ఈ ఇన్సులిన్ మన రక్తంలో ఉండే గ్లూకోజ్‌ని (క్లోమ గ్రంథి) కణాలలోకి చేర్చడానికి తద్వారా మన ఎనర్జీ లు అంటే శక్తికి అవసరం. మనకి తగినంత ఇన్సులిన్ తయారుకాకపోయినా, తయారైన ఇన్సులిన్ మన శరీరం సరిగా ఉపయోగించకపోయినా, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండి, ముందు చెప్పినట్లుగా టైప్-1, టైప్-2 మధుమేహ వస్తాయి.
ఇప్పుడు ఈ కోవిడ్ సమయంలో డయాబెటిస్ గురించి తెలుసుకుందాం. ఇప్పటికే డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు షుగర్ లెవల్స్(రక్తంలో చక్కెర స్థాయిలు) కంట్రోల్ ఉంచుకోవడం తప్పనిసరి ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వారిలో కోవిడ్ తీవ్ర స్థాయిలో వచ్చే ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కోవిడ్‌కి ముందు వరకు షుగర్ లెవల్స్ కంట్రోల్‌గా ఉన్నా కూడా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కొన్ని నెలల పాటు షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటున్నాయి.
కోవిడ్ ఇంజక్షన్ ఉన్నప్పుడు అవసరమైనప్పుడు వాడే గ్లూకోకార్టికాయిడ్స్ (స్టెరాయిడ్స్) వలన షుగర్ లెవల్స్ పెరుగుతుంటాయి. ఆ ఇంజక్షన్‌తో బాధపడుతున్నప్పుడు ఉండే ఇన్‌ఫెక్షన్ మరియు ఒత్తిడి వలన కూడా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ వీటివలన పెరిగే షుగర్ స్థాయిలు స్టెరాయిడ్స్ ఆపిన తరువాత, ఇన్‌ఫెక్షన్ తగ్గిన తర్వాత సాధారణ స్థాయికి వచ్చేస్తాయి. అలా కాకుండా కోవిడ్ నుండి కోలుకున్న చాలా రోజుల తర్వాత, ఎటువంటి స్టెరాయిడ్స్ వాడానప్పుడు కూడా షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం ఇప్పుడు కలవర పెట్టే విషయం. వీరిలో కొందరు కోవిడ్ ఇన్‌ఫెక్షన్ ముందు డయాబెటిస్‌తో ఉండి, కోవిడ్ సమయంలో చేసే పరీక్షలలో షుగర్ వ్యాధి బయపడవచ్చు. లేదా ముందు షుగర్ లెవల్స్ బాడర్ లెవల్స్ ఉంది అంటే ప్రిడయాబెటిస్ స్థాయిలో ఉంది. కోవిడ్ ఇన్‌ఫెక్షన్ వలన డయాబెటిస్ స్థాయిలో వచ్చి ఉండవచ్చు.
ఇవేవి లేకున్నా కూడా వైరస్ ప్రభావం పాంక్రాసిస్‌లో ఉండే బేటా కణాలపై పడి, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. కోవిడ్ కంటే ముందు గతంలో వచ్చిన వైరస్‌ల వలన కూడా షుగర్ వ్యాధి ప్రారంభమవుతుందని నివేదికలు చెబుతున్నాయి.
కోవిడ్ నుండి కోలుకున్న రోగుల్లో మధుమేహ వ్యాధి లక్షణాలు ఉంటే తరుచుగా మూత్రం రావడం, దాహం పెరగడం, ఆకలి ఎక్కువగా ఉండటం, బరువు తగ్గడం, గాయాలు తొందరగా మానకపోవడం, తొందరగా అలసిపోవడం పోవడం, వెంటనే వారు షుగర్ లెవల్స్ గురించి వైద్యుల సలహా మేరకు పరీక్ష చేయించుకోవడం, అవసరమైతే చిక్సిత పొందడం మంచిది.