యువత సక్సెస్ కి డిజిటల్ గైడ్ ”యప్ బీట్”

ప్రపంచం అర చేతికి వచ్చేసింది. ఒక్క క్లిక్ తో కావాల్సిన సమాచారం కళ్ళముందు కనిపిస్తుంది. ఐతే కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న వెబ్ సైట్స్, యాప్స్, డిజిటల్ కంటెంట్ ప్రోవైడైర్స్ లో యువత కెరీర్ కి ఉపయోగపడే మాధ్యమాలు ఎన్ని ? సరిగ్గా ఈ ఆలోచనే ‘యప్ బీట్’కి శ్రీకారం చుట్టింది. యూజర్ ప్రొడక్టివిటీ పెంచాలనే ఉద్దేశంతో ప్రయాణం సాగిస్తుంది యప్ బీట్. యువతకు ఉపయోగపడే వార్తలు, సమాచారం, విశ్లేషణతో పాటు విద్య, వృత్తి, ఉద్యోగాలు, బిజినెస్, స్టార్టప్‌లు కు సంబధించిన అనేక అంశాల సమాహారంగా ముందుకు వెళుతుంది యప్ బీట్.

డిజిటల్ వేదికపై 360 డిగ్రీ సర్విసెస్ తో పాటు www.yupbeat.com సైట్ లో యువత విజయానికి చేరుకునేలా విజ్ఞానం, సమాచారం, అవకాశాలు అందించడంలో మార్గదర్శకత్వం వహిస్తుంది యప్ బీట్. విద్య, వృత్తి, ఉద్యోగాలు, బిజినెస్, స్టార్టప్‌లకు సంబధించిన అనేక అంశాలని వివరంగా అదించడంలో డిజిటల్ గైడ్ పాత్ర పోషిస్తున్న యప్ బీట్. యువతకు ఉపయోగపడే ఈవెంట్స్ ని కండక్ట్ చేసి వారికి అభిరుచి తగ్గ రంగాల్లో స్థిరపడడానికి కావాల్సిన సపోర్ట్, కెరీర్ గైడెన్స్ ని అందిస్తుంది.

యప్ బీట్ ప్రయాణం చాలా భాద్యతతో మొదలైయింది. చాలా సందర్భాల్లో ఒక మంచి సలహా జీవితాన్ని మార్చేస్తుంది. యువత ఎంచుకునే స్ట్రీమ్ లేదా కెరీర్‌ను ఎన్నుకునే ప్రక్రియలో అనేక సందేహాలు ఎదురౌతాయి. వాటన్నిటికి పరిష్కారం చూపే విధంగా కెరీర్ కు మార్గదర్శకత్వం వహించేలా యప్ బీట్ పోర్టల్ పని చేస్తుంది. కేవలం సమాచారమే కాకుండా అనేక అంశాలపై సెమినార్లు, వర్క్ షాప్స్ నిర్వహిస్తూ అవకాశాలని కూడా సృష్టిస్తుంది యుప్ బీట్.

” డిజిటల్ స్పేష్ లో సంచలనాలు, వైరల్ కంటెంట్ కు ఆకర్షితులవ్వడం సులభం. కానీ వీటి ద్వారా యువతకు ఎలాంటి ప్రొడక్టివిటీ వుండదు. యువత సమయాన్ని ప్రొడక్టివ్ గా ఉంచాలనే ఉద్దేశంతో యప్ బీట్ మొదలైయింది. కేవలం సమాచారం మాత్రమే కాకుండా అనేక అంశాలపై సెమినార్లు, లైవ్ వర్క్ షాప్స్ నిర్వహించి యువత కెరీర్ కి ఒక దిక్సూచిగా నిలుస్తుంది యప్ బీట్. రానున్న రోజుల్లో యువతకు మరింత ఉపయోగకరమైన కంటెంట్, యాక్టివిటీస్, అవకాశాలు కల్పించడానికి కార్యచరణ చేస్తున్నాం”- శ్రీనివాస్ రౌళో, యప్ బీట్ కంటెంట్ హెడ్.