విపత్తుల నివారణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ఏర్పాటటై ఏడాది
జీహెచ్ఎంసీలో విపత్తుల నివారణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగం ప్రారంభించి బుధవారం నాటికి సంవత్సరం పూర్తయ్యింది. దేశంలో ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ మినహా విపత్తులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ప్రత్యేకంగా తగు బలగంతో పాటు వాహనాలతో కూడిన విభాగం కేవలం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌లో మాత్రమే ఏర్పాటుచేశారు. ఐపీఎస్ అధికారి విశ్వజిత్‌కంపాటి డైరెక్టర్‌గా ఉన్న ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌లో 120 మంది ప్రత్యేక సిబ్బంది, 8 వాహనాలు, విపత్తులను ఎదుర్కోవడానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చారు. జీహెచ్ఎంసీలోని విద్యుత్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో ఉన్న అదనపు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌లో నియమించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఆకర్షనీయమైన డ్రెస్, హెల్మెట్, షూస్ తదితర రక్షణ సౌకర్యాలను ఈ సిబ్బందికి అందించారు. ఇప్పటికే ఈ విభాగం ద్వారా హైదరాబాద్ నగరంలో మరే నగరాల్లో లేనివిధంగా ఫుట్‌పాత్ అక్రమణల తొలగింపు, హోటళ్లు, రెస్టారెంట్లలో అగ్నిమాపక నివారణ చర్యలపై తనిఖీలు, విపత్తుల సమయంలో అందించిన సేవలు తదితర కార్యక్రమాలను ఈవిడిఎం విభాగం ద్వారా పెద్ద ఎత్తున చేపట్టారు.