మంత్రి బుగ్గ‌న బుగ్గ పీకేస్తారా ?

సీఎం జగన్‍ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్‍ రెడ్డి ఐదేళ్లు మంత్రి జాబితాలో ఉంటారని ప్రచారం జరుగుతున్నా.. కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది అధికార ఎమ్మెల్యేలు రాజేంద్రనాద్‍ రెడ్డి రెండున్నరేళ్ల మంత్రి జాబితాలోనే ఉంటారని.. ఐదేళ్ల మంత్రిగా ఆయనను జగన్‍ రెడ్డి కొనసాగనివ్వరని అంటున్నారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు మంత్రులున్నప్పటికీ.. మంత్రి బుగ్గన మాత్రమే ఐదేళ్లు ఉంటారు. మరో మంత్రిని రెండున్నరేళ్ల తరువాత సీఎం జగన్‍ రెడ్డి తప్పిస్తారని.. మెజార్టీ అధికార ఎమ్మెల్యేలు భావించేవారు.
మంత్రి పదవినుండి బుగ్గనను కూడా తప్పించి తనకు మంత్రి పదవి ఇస్తారని.. అధికార ఎమ్మెల్యే రాంగోపాలరెడ్డి చెబుతున్నారట. అలాంటిదేమీ ఉండదు.. మంత్రి పదవినుండి రాజేంద్రనాద్‍ రెడ్డిని తప్పిస్తే.. తనకే మంత్రి పదవి ఇస్తారని.. శిల్పాచక్రపాణిరెడ్డి చెబుతున్నారట. తాను రెండున్నరేళ్ల మంత్రిగానే మిగిలిపోతారని.. ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గతంలో వలె మంత్రి బుగ్గన సీఎం జగన్‍ రెడ్డిని ఎక్కువగా భుజాన వేసుకోవటం తగ్గించారు.

ఇటీవల కాలంలో ఆర్దిక మంత్రి బుగ్గన అధికారాలను కూడా సీఎం తగ్గించటమే కాకుండా.. ఆర్దిక శాఖ అధికారులకు, తన కార్యాలయ అధికారికే బిల్లుల చెల్లింపు విషయంలో పెత్తనాన్ని సీఎం కట్టబెట్టారు. ఆర్దిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ అవమానాలు పడుతున్న బుగ్గన రాజేంద్రనాద్‍ రెడ్డి మంత్రి పదవిలో ఉండటం కన్నా.. ఎమ్మెల్యేగానే ఉండాలని కోరుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.