ఏడు కోట్ల‌తో ప‌ట్టుబ‌డ్డ మంత్రి గారి కారు

పేరుకు ఆయ‌న పెద్ద మ‌నిషే, సాక్షాత్తూ రాష్ట్రానికి మంత్రి కూడా. దీపం ఉన్న‌ప్పుడే ఇళ్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నుకున్నాడో ఏమో అందుకే అక్ర‌మంగా త‌న కారులో 7 కోట్ల రూపాయ‌లు త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డ్డాడు. ఈ విష‌యం ఆనోట ఈ నోట చేరి ఏకంగా సీఎం ద‌గ్గ‌రికే చేరింది. అయితే పార్టీ మీద చెడ్డ పేరు రాకుండా ఆ కారుని వ‌దిలేయండి, అక్క‌డ దొరికిన డ‌బ్బును వేరు ద‌గ్గ‌రికి త‌ర‌లించండి అని చెప్పిన‌ట్లు స‌మాచారం.

గతంలో సిఎం జగన్‌ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేసిన ఒక మాజీ ఎమ్మెల్యే గతిలేక జగన్‌ కాళ్లపై పడి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పొంది విజయం సాధించారు. కులం కోటాలో మంత్రి పదవి కూడా పొందారు. గతంలో తాను చేసిన విమర్శలు, ఆరోపణలు సోషల్‌ మీడియా ద్వారా ఇప్పటికీ ప్రచారం జరుగుతుండటంతో చేసేది ఏమీ లేక మౌనం వహిస్తున్నారు.

సొంత జిల్లాలో పేరుకే ఆయన మంత్రి.. పెత్తనమంతా.. జగన్‌ రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేదే. సొంత నియోజకవర్గం దాటి ఆ మంత్రి బయటకు వెళ్లలేకపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు, మంత్రులు, కలెక్టరు కూడా ఆమంత్రి ఆదేశాలను ఖాతరు చేయటం లేదని ప్రచారం జరుగుతోంది. సిఎం జగన్‌ రెడ్డి అభిమానాన్ని పొందాలని ఆ మంత్రి చేస్తున్న ప్రయత్నాలు కలిసి రావటంలేదు.

అదృష్టం కలిసి వచ్చినా.. దానిని నిలుపుకోవటంలో ఆమంత్రి చేసిన తప్పిదాలు, పొరపాట్లు చివరకు ఆయన పదవికే ఎసరు పెట్టబోతున్నాయి. అంతే కాకుండా..ఆ మంత్రి ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న ఏడు కోట్ల రూపాయలు విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా.. ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన ఎలాంటి కేసు నమోదు చేయవద్దు. ఆ కారును వదిలేయండి.. అందులో ఉన్న సొమ్మును మరోచోటకు తరలించమని ఆదేశించినట్లు బయటకు పొక్కింది.

ఈ విషయం అటు ముఖ్యమంత్రికి, ఇటు మంత్రికి, విజిలెన్స్‌ అధికారులకు, ఆ మంత్రి ఆంతరంగిక సిబ్బందికి తప్ప మరెవరికీ తెలియదు. ఆ సంఘటన జరిగిందని మీడియా ప్రతినిధులకు తెలిసినా.. ఆధారాలు లేవని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీనిని ఇంతటితో ముగించండి..ఏ విషయం బయటకు పొక్కనివద్దు.. అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని.. సదరు మంత్రిని కూడా పిలిపించి హెచ్చరించారని..ఈ కారణంతో రాబోయే రోజులలో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా..ఆ మంత్రిని పదవి నుండి తొలగించటం ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం.