రెండోసారి తండ్రైన బజ్జీ
టీమిండియా వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్ రెండోసారి తండ్రయ్యాడు. భజ్జీ భార్య, నటి గీతా బస్రా శనివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. భగవంతుడి దయ వల్ల గీతా, బాబు పూర్తి క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నాడు. ‘‘మేం చేయి పట్టుకుని నడిపించేందుకు ఓ చిన్ని చేయి… తన ప్రేమ స్వర్ణం అంతటి విలువైనది.. అద్భుతమైన బహుమతి… మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జీవితాలు పరిపూర్ణమయ్యాయి’’ అంటూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. కాగా 2015, అక్టోబరు 29న పెళ్లి బంధంతో ఒక్కటైన హర్భజన్ సింగ్- గీతా బస్రా దంపతులకు ఇది వరకు కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కెరీర్ విషయానికొస్తే… టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న భజ్జీ.. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగస్వామ్యమైన విషయం తెలిసిందే. ఇక గీతా బస్రా… ‘‘దిల్ దియా హై’’ సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు.