రేవంత్‌తో ట‌చ్‌లో ఉన్న తెరాస ఎమ్మెల్యేలు వీరే

టీపీసీసీ ప‌ద‌విని ప్ర‌క‌టించ‌గానే రాష్ట్ర రాజ‌కీయాల్లో అనేక రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. సీనియ‌ర్ల‌ను కాద‌ని పార్టీ మారిన వారికి ప‌ద‌వి ఇస్తారా అయితే నేను గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌ను అని ఒక‌రూ, పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసిన వారొక‌రు. అయితే ఉన్న‌ప‌లంగా వారు మ‌నుసు మార్చుకున్నారు. ఆ రోజు కాస్తా ఎగిరిప‌డి మాట్లాడినా ఇప్పుడు బుజ్జ‌గింపుల‌తో స‌ద్దుమనిగారు…ఇది ఇలా ఉంటే
అధికార పార్టీ తెరాస నుండి కాంగ్రెస్‌లోకి రావ‌డానికి లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నారు కొంద‌రు ఎమ్మెల్యేలు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి చ‌క్రం తిప్పి.. తెరాస‌లో వెళ్లాక క‌నుమ‌రుగైనారు. అక్క‌డ పార్టీలో చేరిన‌ప్పుడు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు వేరు అమ‌లువుతున్నాయి వేరు అంటూ సన్నిహితుల ద‌గ్గ‌ర గోడు వెల్ల‌బోసుకుంటున్నారు. కాగా రేవంత్‌రెడ్డిని పార్టీ ప్రెసిడెంట్‌గా ప్ర‌క‌టించ‌గానే సొంత గూటికి చేరాల‌నే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసుకుంటున్నారు. ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, ఖ‌మ్మం జిల్లాకు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే రేవంత్‌తో ట‌చ్ ఉన్నార‌ని రాజకీయా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. అవ‌స‌రమైతే త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి తిరిగి చేయి గుర్తు మీద పోటీ చేస్తామంటున్నార‌ని స‌మాచారం. దీంతో సీఎం కేసీఆర్ కంటి మీదు కునుకు లేకుండా పోతోంద‌ని అంటున్నారు సీనియ‌ర్ రాజకీయ నాయ‌కులు.