ఫుడ్‌ బాగాలేనందుకు డ‌బ్బులు వాప‌స్ చేసిన జోమాటో

ఫుడ్ బాగాలేదు అని ఫిర్యాధు చేస్తే క‌స్ట‌మ‌ర్ చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది జోమాటో.
ఓ ప్రైవేట్ సంస్థ ప‌ని చేస్తున్న ఉద్యోగి లంచ్ కోసం ఖార్‌ఖానాలోని గ్రిల్‌9లో నుండి మిక్సిడ్ ఫ్రైడ్ రైస్ ఆర్డ‌ర్ చేశారు. ఫుడ్ తెరిచి చూసిన ఉద్యోగి షాక్ తిన్నాడు. అది పూర్తిగా వాస‌న రావ‌డం, అందులో వేసిన మాంసం ముక్క‌లు కుళ్లి పోయి ఉండ‌డంతో జోమాటోకి ఫిర్యాధు చేశారు. దీంతో వారు రెస్టారెంట్ వారితో మాట్లాడే ప్ర‌య‌త్నం చేసినా వారు స్ప‌దించ‌క పోవ‌డంతో క‌స్ట‌మ‌ర్ చెల్లించిన మొత్తం రూపాయ‌లను తిరిగి ఇచ్చేశారు జోమాటో బృందం. ఇక నుంచైన తాజా ఆహారాన్ని అందించాల‌ని క‌స్ట‌మ‌ర్లు జోమాటోని కోరుతున్నారు.