ప్రాణాలు తీస్తున్న పట్టించుకోని సర్కారు – జయశ్రీ

మాతా, శిశు ఆసుపత్రి వైద్యులను విధుల నుంచి తప్పించాలి

మహిళా మోర్చా ఆధ్వర్యంలో మెరుపు ధర్నా

ప్రసవం కోసం కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రికి శస్త్ర చికిత్స కోసం వచ్చిన మహిళకు బదులు, మరొక మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులపై తక్షణ చర్యల కై డిమాండ్ చేస్తూ, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బిజెపి జిల్లా మహిళా మోర్చా నాయకురాలు, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ ఆధ్వర్యంలో బుధవారం మాతా, శిశు ఆసుపత్రి ఎదుట మహిళా మోర్చా కార్యకర్తలు, బిజెపి నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు. ప్రజల ప్రాణాలపై పట్టింపులేని సర్కారు నిర్లక్ష్య వైఖరి సిగ్గుగా ఉందని జయశ్రీ ఎద్దేవ చేశారు. 24 గంటలు గడచిన బాధ్యులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జిల్లా కలెక్టర్ స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శిల్పా వేదం, బీజేవైఎం స్పోక్స్ పర్సన్ బండారి గాయత్రి, దళిత మోర్చా అధ్యక్షులు వేణు జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మామిడి చైతన్య కార్యదర్శులు బైరి చంద్రకళ ఎడ్ల ప్రేమలత, జోన్ అధ్యక్షులు లావణ్య సునీత సుధా వైష్ణవి కన్నాంబ, మొండన్న, లక్ష్మారెడ్డి, శ్రీకాంత్ పవన్ ,అభి భారతి బిజెపి కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు