ఈట‌ల గెలుపు ఖాయం : జ‌య‌శ్రీ‌

హుజురాబాద్‌లో త్వ‌ర‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌నతా పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు క‌రీంన‌గ‌ర్ జిల్లా పార్టీ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు. అధికార పార్టీ ఎన్ని కుట్ర‌లు చేసినా… గెలుపు మాదేన‌న్నారు. గ‌తంలో దుబ్బాకలో వ‌చ్చిన ఫలిత‌మే ఇక్క‌డ వ‌స్తుంద‌ని… అధిక మోజార్టీతో త‌మ అభ్య‌ర్తిని అసెంబ్లీకి పంపుతామ‌ని పేర్కొన్నారు. అధికార ఉంద‌ని ఇప్ప‌టికే తెరాస నేత‌లు హుజురాబాద్‌లో మాకం వేసి ఓట‌ర్ల‌ను గుప్పిట్లో పెట్టుకొవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని… అన్ని విష‌యాల‌ను త‌మ పార్టీ వారు సాక్షాల‌తో స‌హా భ‌య‌ప‌ట‌పెడుతార‌ని అన్నారు. ఈ ఉప ఎన్నిక ఉంది కాబ‌ట్టే… సీఎం జిల్లా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు కానీ ప్ర‌జ‌ల మీద ప్రేమ‌తో కాద‌ని విమ‌ర్శించారు. ఏడేళ్ల నుండి గుర్తుకు రాని ప్ర‌జ‌లు క‌ష్టాలు ఇయ్యాల గుర్తుకు వ‌చ్చాయా అని ఆమె ప్ర‌శ్నించారు.