పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేసిన ప్రెసిడెంట్‌

పార్ల‌మెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్‌ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందు శుక్రవారం సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలికి, ప్రతిపక్షాలకు ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి గడువు ఇ‍చ్చారు. ఇరు పక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు విద్యాదేవి భండారి శనివారం ప్రకటించారు. దీంతో మొదటి దశ ఎన్నికలు నవంబర్‌ 12న, రెండో దశ ఎన్నికలు 19 జరగనున్నాయి. తనకు 153 మంది సభ్యలు మద్దతు ఉందంటూ ప్రధాని మంత్రి కేపీ శర్మ ఓలి ప్రకటించారు.తనకు 121 మంది సభ్యులతో పాటు, జేఎస్‌పీఎన్‌కు చెందిన మరో 32 మంది సభ్యుల మద్దతు ఉందని పేర్కొన్నారు. బలాన్ని సభలో రుజువు చేసుకోలేకపోవడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది.అయితే కేపీ శర్మ ఓలి బలాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం ఏర్పా టు చేయాల్సిందిగా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు.అయితే ప్రతిపక్షాలు సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో విఫలం చెందాయి . నేపాల్‌ పార్లమెంట్‌లో 275 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 136 మంది మద్దతు అవసరం.