మల్లారెడ్డి, కొప్పులకు మంత్రి గండం
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా కీలకంగా మారాయి. గత కొన్ని రోజులుగా ఎప్పుటికప్పుడు సమీకరణాలు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల కమాలకర్‌కు ఉద్వాసన తప్పదని, అందుకు ఓ పెద్ద స్కేచ్ వేశారు. తీరా ఇప్పుడు చూస్తే అతను సేఫ్ జోన్‌లో ఉన్నారు. మంత్రివర్గం నుంచి ఈటల ఉద్వాసన పలికినప్పట్టి నుంచి మంత్రి వర్గంలో చేరాలని చాలా మంది ఫైరవీలు మొదలు పెట్టేశారు. అయితే అశావాహులు అనుకున్నట్లు సీఎం కేసీఆర్ వారికి పెద్దపీట వేస్తారా లేక పక్కన బెడుతారా అనేది ఇప్పుడు సందేహాంగా మారింది.
ఇది ఇలా ఉంటే సాధరణ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తన కూతుర్ని మంత్రి వర్గంలోకి తీసుకరావడానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. అప్పట్లో కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అందుకే మంత్రి గంగుల కమలాకర్‌ని తప్పించడానికి ఓ సినిమా నటిని రంగంలోకి దించారని పుకార్లు షికారు చేశాయి. కట్ చేస్తే ఇప్పుడు ఈటలను కట్టడి చేయడానికి గంగులకే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రంగంలోకి దింపినట్లు ఉంది తాజా పరిణామాలు.
కాగా మరికొన్ని రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం సాగుతోంది. అయితే ఎవరిని తప్పిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఇలా ఉంటే ఈటల భూ వ్యవహారాల కథ మొదలవ్వగానే మంత్రి కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డిల మీద కూడా విపక్షాలు విమర్శలు చేశాయి. వీరిద్దరూ కూడా భూములను అక్రమంగా ఖబ్జా చేశారని అయితే సీఎం మనసులో వీరిద్దరిని తప్పించి ఖమ్మం జిల్లాకు చెందిన సండ్రవెంకట వీరయ్య, ఎమ్మెల్సీ కవిత, వరంగల్ జిల్లాకు ఓ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు రాజకీయ వర్గాల్లోకి జోరుగా చర్చ జరుగుతుంది.