ఘట్‌కేసర్ వాసులకు కరోనా వ్యాక్సిన్
ఘట్‌కేసర్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ కోరారు. మున్సిపల్ కార్యాలయం ముందుగల అంగన్‌వాడీ కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని వైస్ ఛైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కమిషనర్ వసంతలతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గౌరవ కలెక్టర్ శ్వేతా మహాంతి గారు, సందర్శించిన సమయంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలు వ్యాక్సిన్ తీసుకొనుటకు ప్రభుత్వ వైద్యశాలలో చాలా ఇబ్బందిగా ఉంటుందని కలెక్టర్ గారికి తెలియజేయడంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ డిఎంహెచ్ఓ గారికి ఆదేశించడంతో వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. అలాగే ప్రభుత్వ బాలుర పాఠశాల లో ఏర్పాటు చేసిన కారోన పరీక్షల కేంద్రాన్ని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట్ రెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, కడుపొల్ల మల్లేష్, కో-ఆప్షన్ మెంబర్లు SK షౌకత్ మియా, AE శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ శ్రీదర్ రెడ్డి, తెరాస నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి , కృప నిధి , పల్లె విజయ్ , ఎంవీరోల్మెంట్ ఇంజనీర్ గున్న రెడ్డి , ఆశా వర్కర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.