ఈటెల లాంటి మాటలకు సర్కార్ జంకు తిన్నదా ?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈటెల లాంటి మాటలకు ప్రభుత్వం జంకు తిన్నాదా అనిపిస్తోంది. ఆగమోఘాల మీద అచ్చంపేట, దేవరాయాంజల్ భూములపై సర్వే చేసి మంత్రి పదవి నుండి ఉద్వాసన పలికారు. అయితే ఆ మరుక్షణం నుండే ఈటలను టార్గెట్ చేసి అతని సంబంధిచిన భూములు, ఆస్తులపై సర్వేలు చేసి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇంతలోనే అచ్చంపేట భూముల విషయంలో కోర్టు మెట్లు ఎక్కిన ఈటల న్యాయ పోరాటం ప్రారంభించారు.
మరోవైపు రాజకీయంగా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశంపై తన నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి బారీ కార్ల ర్యాలీతో తన నియోజకవర్గానికి చేరుకున్నారు. ఆనాటి నుండి సుతిమొత్తగా ఈటల తన ఈటెల లాంటి మాటలతో అటు కేసీఆర్‌ని, ఇటు పార్టీని ఇరకాటంలో పెట్టారు. అయితే అప్పుడే పార్టీ నుండి కూడా తొలగించాలనే ప్రయత్నం చేశారు. కానీ అలాంటి నిర్ణయం వల్ల తెరాస నష్టం వాటిల్లుతుందనే వ్యుహాంలో ఇప్పటి వరకు ఆలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా ఇప్పటి వరకు కూడా ఈటల కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. తనంతట తాను రాజీనామ చేయకుండా పార్టీ తొలగించే వరకు ఈటల చూస్తున్నట్లు సమాచారం. అయితే తీసుకుంటున్న నిర్ణయాలు చూసి ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా పార్టీ వేచి చూస్తోంది. అయితే ఇక్కడ ఈటల గెలిచారా లేక కేసీఆర్ గెలిచారా అనేది సంద్గితం ఉంది.