సిద్దిపేటలో హారీష్‌రావును పక్కన పెట్టిన సీఎం
తెలంగాణ రాష్ట్ర రాజీకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు పార్టీలో సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్‌ను పక్కన పెట్టడం, ఇప్పుడు సిద్దిపేటలో హారీష్‌రావుని దూరంగా ఉంచడం ప్రకంపనలు దారితీస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా సిద్దిపేటలలో బలమున్న నాయకుడు ఎవరూ అంటే హారీష్‌రావు అని చెప్పుకోక తప్పదు. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కూడా అతని అదే స్థానం ఉంది. సీఎం కేసీఆర్ తర్వాత పార్టీలో బలం ఉన్ననాయకుడిగా ట్రబుల్ షూటర్‌గా పేరు పొందారు.
అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నా… అసలు చిక్కు ఇప్పుడు వచ్చే పడింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. కాగా ఆయా ప్రాంతాల్లో మేయర్ గా ఎవరిని ఎన్నిక చేయాలనే విషయంలో కొద్దిమంది మంత్రులతో పాటు పార్టీ నాయకులకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు సీఎం కేసీఆర్. అయితే సిద్దిపేటలో మాత్రం హారీష్‌రావుని ప్రక్కకు తప్పించి మాజీ మేయర్ రవీదంర్‌సింగ్, మరో నాయకుడు ప్రతాప్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ విషయంపై హారీష్‌రావు వర్గం సీఎంపై తీవ్ర ఆగ్రహాంతో ఉన్నట్లు సమాచారం. కాగా ఇది ఏ రాజకీయ కోణంలో చేశారో తెలియాలంటే కేసీఆర్ మాత్రమే పెదవి విప్పాలి.