దేశ వ్యాప్తంగా పెరుగుతున్న లాక్‌డౌన్
కరోన రెండో దశతో భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరూగా ఆయా రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్ పెట్టాయి. అయితే దేశ వ్యాప్తంగా సంపూర్ణ లౌక్‌డౌన్ పెడితే తప్పా కరోనాని మళ్లీ కట్టడి చేయలేమని అభిప్రాయ పడుతున్నారు వైద్యులు. గత సంవత్సరం పెట్టిన లౌక్‌డౌన్ వల్లే ఇప్పటి వరకూ కుదటపడలేదని ప్రధానితో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. తమ రాష్ట్రాల్లో లౌక్‌డౌన్ పెట్టాలా వద్దా అనే నిర్ణయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రులకు వదిలేశారు ప్రధాని మోడీ.
- దిల్లీలో గత నెల 19 నుండి లౌక్‌డౌన్ అమలులో ఉంది, ఈ నెల 10 వరకు సంపూర్ణ లాక్‌డౌన్.
- హరియాణాలో ఈనెల 3వ తేదీ నుండి ఏడు రోజుల పాటు లౌక్‌డౌన్.
- ఒడిశాలో ఈ నెల 5 నుండి 19 వరకు పూర్తి లౌక్‌డౌన్.
- రాజస్థాన్‌లో ఈ నెల 17 వరకు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు.
- కర్నాటలో గత నెల 27 నుండి ఈ నెల 12 వరకు లౌక్‌డౌన్.
ఇలా జార్ఖాండ్, చత్తీస్‌ఘడ్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పచ్చిమ బెంగాళ్, అస్సాం, నాగాలాండ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తీవ్రమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.