పసలేని షర్మిల ప్రసంగం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ కొత్త పార్టీ ఆవశ్యకత ఎందుకు వచ్చిందో తెలియదు. అయినా కానీ తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని ఓ మహిళ ఇక్కడ అధికార పార్టీని ప్రశ్నించడానికి ఓ పార్టీ అవసరం ఉందని మాత్రం ఉందని గ్రహించి పార్టీ పెడుతున్నానని చెప్పింది.
దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వై.ఎస్. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విల్లూరుతోంది. ఇందుకు తనకు కాస్తా పట్టు ఉన్న ఖమ్మం ప్రాంతాన్ని ఎంచుకుంది. బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వైఎస్ఆర్ జయంతి రోజైన జూలై 8న పార్టీ పేరు, జెండా, ఎజెండా చెపుతానని వెల్లడించారు. అయితే రాజకీయ ప్రస్థానం మొదలుపెడుతున్నారు అంటే అందుకు తగ్గ మాటలు, చాకులులాగా ఉండాలి.
కేసీఆర్‌ని ప్రధానంగా చేసుకొని విమర్శలు దిగిన షర్మిలా ఎక్కడా కూడా పదునైనా… భాషాను మాట్లాడలేదు. తెలంగాణలో ప్రజల్ని ఆకట్టుకోవాలంటే ఆ మాట, యాస, భాషా అన్ని రక్తి కట్టించాలి. అది రాజకీయ నాయకుడైన సరే, సినిమా హీరో అయినా సరే. మరీ ముఖ్యంగా రాజకీయంగా ఎదగాలంటే మంచి వాక్ చాతుర్యం కలిగి ఉండాలి. కానీ షర్మిలా ప్రసంగంలో ఎక్కడా కూడా తెలంగాణ భాషా, యాస కనిపించలేదు. కేవలం ఓ రెండు సార్లు మాత్రమే బరాబర్, ఓ సీఎం సారు అని తెలంగాణ యాసలో అన్నారే తప్పా ఎక్కడ కూడా ప్రజలకు కావాల్సిన ఆసక్తి కరమైన మాటలు మాట్లాడలేక పోయింది. నిజానికి కొత్త పార్టీ పెడుతున్నాం అంటే అందుకు కావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు పూసగుచ్చినట్లు అందించి వారిని ఆలోచనలో పడేయాలి కానీ … ఇప్పటికే సాధారణ ప్రతి పక్షంలా ఉద్యోగాలు రాలేదంటే సప్పగా మాట్లాడితే ఎలా.
ఏదీ ఏమైనా… షర్మిలా ప్రసంగంలో పస లేదని ప్రజలు అనుకుంటున్నారు. అయితే తనని తెలంగాణ బిడ్డలు ఆధరించి అక్కున చేర్చకుంటారో లేదో వేచి చూడాల్సిందే మరి.
శ్రీ…