హోలీ వేళ మీ కళ్లను ఏ విధంగా కాపాడుకోవాలి
ఈ హోలీ వేళ మీ కళ్లను ఏ విధంగా కాపాడుకోవాలి: చేయాల్సిన మరియు చేయకూడని పనులు
– డాక్టర్ గౌరవ్ అరోరా
రంగుల పండుగ హోలీ సమీపిస్తోన్న వేళ, ప్రతి ఒక్కరూ అత్యంత ఆసక్తిగా వేడుకలలో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నారు. అయితే తగినన్ని జాగ్రత్తలను కళ్లు కాపాడుకునేందుకు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు, చాలామంది ఈ వేడుకలలో పాల్గొనేటప్పుడు నీటిని వెదజల్లుతుంటారు కానీ, దానివల్ల కలిగే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం ఆలోచించరు. వినోదం పొందడం అవసరమే కానీ, కంటి సంరక్షణ దగ్గరకు వచ్చేసరికి మనం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
ఇటీవలి కాలంలో, రంగులు తయారుచేయడానికి కూరగాయలు లేదంటే ఎండిన పూల నుంచి తీసిన రంగులను వాడటం లేదు. వాటికి బదులుగా సింథటిక్ రసాయన రంగులను వినియోగిస్తున్నారు. ఇవి నేత్ర దృష్టి పరంగా ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. అందువల్ల, హోలీ వేడుకలలో పాల్గొనేటప్పుడు మన కంటి సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంది లేదంటే, దురద మరియు/లేదా ఎలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వంటి వాటితో బాధపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు తాత్కాలిక అంధత్వమూ రావొచ్చు. అందువల్ల వేడుకలను బాధ్యతాయుతంగా జరుపుకోండి.
హోలీ ఆడేముందు మీరు పరిగణలోకి తీసుకుని ఆచరించాల్సిన మరియు ఆచరించ కూడని కొన్ని అంశాల జాబితాః
చేయాల్సిన అంశాలుః
- నూనె రక్షణ
కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొబ్బరి నూనె లేదా బాదం నూనెను మీరు బయటకు వెళ్లే ముందు రాసుకోవడం చేస్తే చర్మం పాడవకుండా కాపాడబడుతుంది. - షేడ్స్ వినియోగించండి
ఆకర్షణీయంగా మీరు కనబడేందుకు సహాయం చేయడం మాత్రమే కాదు, మీ కళ్లకు తగిన రక్షణను సైతం షేడ్స్ అందిస్తాయి. ఎవరైనా రంగులను మీ కళ్లలో కొట్టేందుకు ప్రయత్నిస్తే ఈ షేడ్స్ మీ కళ్లలోకి ఆ రంగులు చేరకుండా అడ్డుకుంటాయి. ఈ షేడ్స్‌లో ప్రొటెక్టివ్ గ్లాస్‌లు, సన్‌గ్లాసెస్ లేదా ప్లెయిన్ గ్లాస్‌లు అయినా రక్షణ అందిస్తాయి. రంగులు కళ్లలో చేరకుండా ఉండేందుకు సైతం ఇది సహాయపడుతుంది. - కళ్లు మూస్తూ తెరుస్తుండటం మరియు శుభ్రం చేయడం
మీ కళ్లలో పడిన రంగులను వీలైనంతగా తొలగించడం చేయడం అత్యంత కీలకం. ఒకవేళ రంగులు మీ కంటిలో చేరితే, వెంటనే కళ్లను పరిశుభ్రమైన లేదా తాగునీటితో పలుమార్లు కడగడం చేయాలి.
మీ మొఖం కిందకు దించి, నెమ్మదిగా మీ కళ్లను మీ అరచేతిలో నింపుకున్న నీటిలో ఉంచి శుభ్రపరచడానికి ప్రయత్నించాలి. తరచుగా కళ్లు మూసి చేయడం మరియు మీ కళ్లను పైకి, క్రిందకు తిప్పడం ద్వారా రంగులను వీలైనంత వరకూ తొలగించవచ్చు. అలాగని మీ కళ్లలోని నేరుగా నీరు పోయడం చేయరాదు. అలా చేస్తే అది ఇంకా ప్రమాదకరంగా మారవచ్చు. మీ జుట్టు ముడివేసుకుని, దానిపై టోపీ పెట్టడం సూచనీయం. తద్వారా రంగు నీళ్లు మీ జుట్టు ద్వారా కళ్లలోకి చేరే ప్రమాదం నివారించవచ్చు. హోలీ ఆడినప్పుడు కళ్లలో రంగులు పడితే కంటికి ఇన్‌ఫెక్షన్లు కలిగించడంతో పాటుగా ఎలర్జీలు కూడా కలిగించవచ్చు. ఈ సమయంలో మీ కళ్లను తెరిచి ఉంచడానికి ప్రయత్నించడం మంచిది. - డాక్టర్‌ను సంప్రదించండి
ఒకవేళ మీ కళ్లు ఎర్రబారి, అది పోకపోయినా లేదంటే ఒకవేళ కళ్లు దురదలు పెడుతున్నా, కళ్ల నుంచి నీరు వస్తున్నా, మీకు అసౌకర్యంగా ఉన్నా లేదంటే రక్తస్రావం అవుతున్నా తక్షణమే కంటి చికిత్స నిపుణులను సంప్రదించడం చేయాలి. - ఆప్రమప్తంగా ఉండండి
కంటికి దగ్గరగా ఎక్కడా కూడా రంగులు పడకుండా జాగ్రత్త పడటం ప్రయోజనకరం. అయితే, అది అన్ని వేళలా సాధ్యం కాదు. అందువల్ల, ఒకవేళ ఎవరైనా మీ మొహంపై రంగులు జల్లే పరిస్ధితిలో ఉంటే మీ కళ్లు, పెదాలను గట్టిగా మూసి వేయండి.
చేయకూడనివి. - కళ్లను నలుపరాదు
హోలీ ఆడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం కళ్లను నలుపకపోవడం. ఈ కళ్లను తాకడం లేదా తరచుగా వాటిని నలుపడం చేయరాదు. అలా చేస్తే నేత్ర దృష్టిని కోల్పోవడం లేదా చికాకు కలిగించడం జరుగవచ్చు. - నీటి బెలూన్స్ నిరోధించాలి…
నీటి బెలూన్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో పాటుగా కళ్లకు తీవ్ర గాయాలను సైతం కలిగించే ప్రమాదం ఉంది. ఈ కారణంగా రక్తస్రావం, కంటి లోపల కటకాలు స్ధానభ్రంశం కావడం, మాక్యులర్ ఎడెమా లేదా రెటీనా నిర్లిప్తంగా మారడం జరుగవచ్చు. ఈ కారణం చేత కంటి చూపు కోల్పోవడం లేదా మొత్తానికి కంటినే కోల్పోవడం కూడా జరుగవచ్చు. ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే ఆప్తమాలజిస్ట్‌ను సంప్రదించవలసి ఉంటుంది. - కళ్లలో పడిన పదార్ధాలను తొలగించడం
మీ కళ్లలో పడిన ఏదైనా వస్తువు లేదంటే పదార్థాలను హ్యాండ్ కర్ఛీఫ్ లేదా టిష్యూ పేపర్ వినియోగించి తీయడానికి ప్రయత్నించవద్దు. ఇలా చేస్తే పరిస్థితులు మరింతగా దిగజారే ప్రమాదం ఉంది. - కాంటాక్ట్ లెన్స్‌లు వాడవద్దు
కాంటాక్ట్‌లెన్స్‌లు వాడటం చేయరాదు. దీనికి బదులుగా డెయిలీ డిస్పోజబుల్ తరహ వాటిని వాడవచ్చు. కాంటాక్ట్ లెన్స్ వల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. కాంటాక్ట్‌లెన్స్‌లో నీటిని పీల్చుకునే లక్షణాలు ఉన్నాయి మరియు కంటిలో పడిన రంగు నీళ్లను సైతం అది పీల్చుకోవడం వల్ల అలర్జీలు మరియు ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది. మరింత మార్గనిర్దేశనం కోసం మీ కాంటాక్ట్‌లెన్స్ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి.
కళ్లద్దాలను ధరించే వారు హోలీ ఆడుతున్న సమయంలో ఆప్రమప్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. మరీ ముఖ్యంగా ముఖం మీద రంగులు చల్లే సమయంలో ! ఒకవేళ ఎవరైనా రంగులు చల్లడానికి వస్తే, మీరు ముందుగానే ముఖంపై రాయవద్దని కోరడం చేయవచ్చు లేదంటే అతను/ఆమె కంటి అద్దాలతో వారికే ప్రమాదం జరుగవచ్చు.
కంటి అద్దాలను ధరించే వారు హోలీ సమయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వారు కంటిఅద్దాలను ధరిస్తే, రంగులు వాటి కంటి అద్దాలపై నిలిచిపోయే ప్రమాదం ఉంది. రిమ్‌లెస్ కంటి అద్దాలు అతి సులభంగా పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల, వారు కంటి అద్దాలను వాడకపోవడం ఉత్తమం.
ప్రకాశవంతమైన రంగులు మన జీవితంలో ఎన్నో సానుకూలమైన మార్పులు తీసుకువస్తాయనే నమ్మకం మీలో ఉన్నట్లయితే, మీ కళ్లకు దూరంగా అవి ఉన్నాయన్న భరోసానూ కలిగి ఉండండి.
హోలీ పండుగను సంపూర్ణంగా ఆస్వాదించండి కానీ ఈ సూచనలు మాత్రం పాటించండి. తద్వారా మీతో పాటుగా మీ ప్రియమైన వారు కూడా సురక్షితంగా ఉండగలరు. సంతోషంగా ఉండండి… జీవితాన్ని రంగులమయం చేసుకోండి !!
( రీజనల్ హెడ్, క్లీనికల్ సర్వీసెస్, డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆస్పత్రి, హైదరాబాద్, తెలంగాణ)