హెడ్ ఇన్‌జ్యురీ నుంచి కోలుకున్నవారితో ఎస్ఎల్‌జి ఆస్పత్రిలో ఆత్మీయ సమావేశం
“వరల్డ్ హెడ్ ఇన్‌జ్యురీస్ అవేర్‌నెస్ డే – 2021” సందర్భంగా ఎస్ఎల్‌జి ఆస్పత్రిలో శనివారం ప్రమా దాలలో హెడ్ ఇంజ్యురీస్ గురై చికిత్స పొంది కోలుకున్నవారితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్‌జి ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరో & వెన్నెముక సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర హెచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి ఎస్ఎల్‌జి ఆస్పత్రి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి. శివరామరాజు, ముఖ్య అతిథిగా హాజరై ఆస్పత్రి ఈడీ డీవీఎస్ సోమరాజు, ఆస్పత్రిలో హెడ్ ఇంజ్యురీకి చికిత్స పొంది ఆరోగ్యంగా ఉన్న 15 మంది బాధితులు (75 సంవత్సరాల వృద్ధుడితో సహా) వారి కుటుంబసభ్యులు, అందులో రెండేళ్ల వయస్సుగల హెడ్ ఇంజ్యురీ బాధిత బాలుడితో కలిసి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ డి. శివరామరాజు మాట్లాడుతూ తలకు, బ్రెయిన్‌కు తగిలే గాయాలను విస్మరించడానికి వీలు లేదని, ప్రమాదాలు జరగకుండా సరియైన జాగ్రత్తలు పాటించడంతో పాటు హెడ్ ఇంజ్యురీస్‌పై అప్రమత్తంగా ఉంటే ఎంతో విలువైన జీవితాలను కాపాడుకోవచ్చని చైర్మన్ శివరామరాజు అన్నారు. మనిషి జీవితంలో తల యొక్క ప్రాముఖ్యత, తలకు తగిలే గాయాల వల్ల వైకల్యాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్లపై సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు.
అనంతరం డాక్టర్ రాఘవేంద్ర మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా చర్యలు పాటిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న పేషెంట్లు, కుటుంబ సభ్యులు , వాహనదారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి సంవత్సరం మార్చి 20న తలకు తగిలే గాయాలు దానికి గల కారణాలు మరియు ఈ గాయాల తీవ్రతతో జరిగే నష్టం గురించి అవగాహన పెంచడానికి అంకితం చేసినట్లు డాక్టర్ రాఘవేంద్ర ఈ సందర్భంగా వివరించారు. 2021 నుంచి వచ్చే 3 సంవత్సరాల వరకు “నా మెదడు గాయం కంటే ఎక్కువ” అనే నినాదంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే తలకు తగిలే గాయాల వల్లనే ఎక్కువగా వైకల్యాలు, మరణాలు సంభవిస్తున్నట్లు డాక్టర్ రాఘవేంద్ర తెలిపారు. దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 2 మిలియన్ల మంది మెదడు గాయాల బారిన పడుతున్నట్లు వార్షిక అంచనాలు చెప్తున్నాయన్నారు. అదే విధంగా కనీసం 0.2 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ రకమైన హెడ్ ఇంజ్యురీస్ బాధితులు 18- 44 సంవత్సరాల వయస్సు వారే ఎక్కువ మంది ఉంటున్నారని వారిలో పురుషులు ఎక్కువగా ఉంటున్నారన్నారు. రోడ్లపై విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ వల్ల వేగం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఇలా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి మాత్రమే కాకుండా కుటుంబాలు కూడా ఎంతో నష్టపోతాయని తెలిపారు. హెల్మెట్ ధరించడం, కారు సీట్ బెల్ట్ పెట్టడం, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌లను నిషేధించడం, మద్యం సేవించిన తర్వాత డ్రైవింగ్ చేయకపోవడం వంటి కొన్ని సాధారణ చర్యలు ఈ ప్రమాదాలను తీవ్రంగా తగ్గిస్తాయని ఆయన వివరించారు.
గోల్డెన్ అవర్‌పై అవగాహన పెంచుకోవాలి..
తీవ్రమైన హెడ్ ఇంజ్యురీ తర్వాత మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ గా పిలుస్తామని డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. చాలా సందర్భాలలో, బాధితులను గోల్డెన్ అవర్ వ్యవధిలో తీసుకురాకపోవడం వల్లనే మరణాలు, ఇతర వైకల్యాలు సంభవిస్తాయని ఆయన తెలిపారు. పోలీసుల కంటే, ప్రమాదం జరిగిన చుట్టు పక్కల ప్రజలు బాధితులను తీసుకు వస్తారని కానీ అప్పటికే గోల్డెన్ అవర్ పోతుందని తెలిపారు. ముఖ్యంగా ప్రతిఒక్కరూ గోల్డెన్ అవర్‌పై అవగాహన పెంచుకుంటే ప్రాణనష్టం తగ్గించవచ్చని తెలిపారు.ఇది పాటిస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారమవుతామని డాక్టర్ రాఘవేంద్ర హెచ్ పేర్కొన్నారు.
ఎస్ఎల్‌జి ఆస్పత్రి గురించి..
ఎస్‌ఎల్‌జి ఆస్పత్రి హైదరాబాద్ శివారులోని నిజాంపేట సమీపంలో బాచుపల్లి వద్ద ఉన్నది. అన్నిరకాల సమగ్రమైన వైద్యసేవలందించేందుకు అధునాతన పరికరాలతో పాటు అన్నిరకాల మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేశారు. 999 పడకల సామర్థ్యంతో అత్యంత ఆధునికమైన హంగులతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. అన్ని వయస్సుల వారికి, అన్ని రకాల వైద్యసేవలందించేందుకు ప్రత్యేక విభాగాలు ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి.