అకాడమిక్‌ సెషన్‌ 2021కి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్న హాంకాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్స్‌ యంగ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ 2020లో నెంబర్‌ 1 ర్యాంకు, క్యూఎస్‌ వల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ 2021లో టాప్‌ 30లో నిలిచిన ది హాంకాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (HKUST), 2021-2022 అకాడమిక్‌ సెషన్‌ కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. 21వ శతాబ్దాపు ఉద్యోగాలకు అవసరమైన ప్రతిభ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, నాయకత్వ లక్షణాల విషయంలో విద్యార్థులకు సాయపడేలా రూపొందించిన యూనివర్సిటీకి ఇంజినీరింగ్, సైన్స్‌,హ్యూమానిటీస్‌, బిజినెస్‌ స్ట్రీమ్స్‌లోని ప్రముఖ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
HKUSTలో 90కి పైగా దేశాల నుంచి విద్యార్థులు వస్తారు. అంతర్జాతీయ విద్యార్థి కమ్యూనిటీలో భారతీయ విద్యార్థులు మూడో స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత అర్హులైన ఫ్యాకల్టీ స్టాఫ్‌- వీరిలో 142 మంది ప్రపంచంలోనే టాప్‌ 2% సైంటిస్టులని ఇటీవలే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కితాబిచ్చిన వారి మార్గదర్శనంలో విద్యార్థులు చదువుకుంటారు. మహమ్మారి కారణంగా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ అందించేందుకు భారతీయ విద్యార్థుల దరఖాస్తులను రోలింగ్‌ విధానంలో అంగీకరించడం జరుగుతుంది. విద్యార్థులు తమ అప్లికేషన్లను https://join.ust.hk/apply లో సబ్మిట్‌ చేయవచ్చు. అలాగే అడ్మిషన్‌ సంబంధిత అప్‌డేట్స్ కోసం https://join.ust.hk/updates సందర్శించవచ్చు.
విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సంస్కృతి ప్రోత్సహించడం, గ్రాడ్యుయేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌లో HKUSTకి చక్కని ట్రాక్‌ రికార్డు ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ మార్కెట్‌ తలకిందులుగా ఉన్నప్పటికీ డెలాయిట్‌, ఈవై, గోల్డ్‌మన్‌ సాచ్స్‌, ఐబీఎం, జేపీ మోర్గాన్‌, మోర్గాన్‌ స్టాన్లీ, పీడబ్ల్యూసీ వంటి సంస్థల్లో చాలా మంది భారతీయ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు.
కోర్సుల్లో చేరేందుకు అర్హత ప్రమాణలు:
అప్లై చేయాలనుకుంటున్న విద్యార్థులు జనరల్‌ అడ్మిషన్‌, స్కూల్‌/ప్రోగ్రామ్‌-స్పెసిఫిక్‌ అండ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అర్హతలు కలిగి ఉండాలి. అకాడమిక్‌ పర్ఫామెన్స్‌, నాన్‌-అకాడమిక్‌ పర్ఫామెన్స్‌ను సమగ్రంగా పరిశీలించి ప్రతీ అప్లికేషన్‌ను యూనివర్సిటీ సమీక్షిస్తుంది. బోర్డు పరీక్షలు రాసిన భారతీయ విద్యార్థులు XII వ తరగతి పూర్తి చేసినట్టు పాస్‌ సర్టిఫికేట్‌ (రాష్ట్ర, జాతీయ బోర్డుల) కలిగి ఉండాల్సి ఉంటుంది. గతంలో HKUSTలో అడ్మిట్‌ అయిన విద్యార్థుల రెఫరెన్స్ స్కోర్‌, “మొత్తంగా సగటు 85% లేదా అంత కంటే ఎక్కువ.”
నోట్‌: Xవ తరగతి ఫలితాలను (రాష్ట్ర, జాతీయ బోర్డులు) కూడా దరఖాస్తుదారులు సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం :https://join.ust.hk/admissions/international-qualifications/
ది హాంకాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్కాలర్‌షిప్‌ అర్హతలు
కాంపిటీటివ్‌ మెరిట్‌ ఆధారంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు యూనివర్సిటీ స్కాలర్‌షిప్పులు అందజేస్తుంది. ఈ స్కాలర్‌షిప్స్‌ ఒక విడత లేదా రెన్యువబుల్‌, పూర్తిగా లేదా పాక్షిక ట్యూషన్‌ మినహాయింపులతో ఉంటాయి.
అన్ని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది, ప్రత్యేకంగా ఎటువంటి అప్లికేషన్‌ అవసరం లేదు. స్కాలర్‌ షిప్‌ ద్వారా ప్రతీ సంవత్సరం అందించే అత్యధిక మొత్తం ఫుల్‌ ట్యూషన్‌ పీజుతో పాటు HK$ 55,000 (దాదాపు రూ.5.13 లక్షలు) అలవెన్స్‌గా ఉంటుంది. సంతృప్తికరమైన అకాడమిక్‌ పర్ఫామెన్స్‌తో దీని రెన్యువల్‌ ఆధారపడి ఉంటుంది. HKUST అడ్మిషన్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ఫర్‌ ఐబీ డిప్లొమోహోల్డర్స్‌ & GCEAL/ఇంటర్నేషనల్‌ AL క్వాలిఫికేషన్‌ హోల్డర్లు దయచేసి https://join.ust.hk/fees-and-scholarships సందర్శించండి. మిగిలిన అర్హతలకు కేస్‌-బై-కేస్‌ పరిశీలించి స్కాలర్‌షిప్స్‌ను యూనివర్సిటీ అందిస్తుంది.
వచ్చే వారం వెబినార్‌
ఆసక్తి కలిగిన విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం మార్చి 24, 2021న HKUST ఉచితంగా ఒక ప్రత్యేక వెబినార్‌ నిర్వహిస్తోంది. యూనివర్సిటీ ప్రతినిధి ప్రముఖ కోర్సులను వివరిస్తారు, హాంకాంగ్‌లో తమ చదువులు, ఉద్యోగ అనుభవాలను భారతీయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు తెలియజేస్తారు. ఈ వెబినార్‌కు దిగువ తెలిపిన లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు:
https://us02web.zoom.us/webinar/register/WN_PVAazMIPRJOmGGe_pxyJdQ