గుండె జబ్బులపై అవగాహాన పెంచుకోవాలి
– ఫిబ్రవరి 7 నుండి 14 వరకు 2021
డాక్టర్ సందీప్ మూడే,
కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్,
కిమ్స్ సవీర, అనంతపురం.
గుండె సమస్యలతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలలో కూడా అప్పుడే జన్మించిన పిల్లలో కూడా ఈ గుండె సమస్యలు తలెత్తున్నాయి. ఈ అంశంపై ప్రతి ఒక్కరూ అవగాహాన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 7వ తేదీ నుండి 14 తేదీ వరకు అవగాహాన వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పుట్టుకతో వచ్చే గుండె జబ్బు అంటే ఏమిటి ?
పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులు లేదా పుట్టుకతో వచ్చే గుండె లోపాలు అనేవి గుండె లేదా దాని రక్తనాళాల అభివృద్ధికి సంబంధించిన సాధారణ నిర్మాణ లోపాలుగా వల్ల కలుగుతాయి. గుండె గదుల మధ్య రంధ్రం (సెప్టాల్ గోడలో లోపము), గుండె యొక్క ప్రధాన రక్త నాళము (బృహద్ధమని) ఇరుకైపోవడం, మరియు శ్వాసకోశ సిర (పల్మనరీ వెయిన్), ఇరుకైపోవడం అనేవి పుట్టుకతో వచ్చే కొన్ని సాధారణ గుండె లోపాలు.
పుట్టుకతో వచ్చే గుండె జబ్బు ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి ?
- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.
-అలసట మరియు అసహనం
-వడి వడి గా శ్వాస తీసుకోవడం
-అధికంగా చెమట పట్టుట
-ఛాతి నొప్పి
-శరీరం నీలివర్ణంలోకి మారడం.
-సరైన ఎదుగుద లేకపోవడం
-శ్వాసావరోధం (డిస్పొనోయా) కారణంగా పిల్లలు తక్కువగా తినడం
ప్రధాన కారణాలు ఏమిటి?
దీనికి అత్యంత సాధారణ కారణాలేవంటే తల్లి గర్భంలో గర్భస్థ శిశువు యొక్క ప్రారంభ అభివృద్ధి సమయంలో అంతర్గత వాతావరణంలో జరిగే మార్పులు. ఆ కారకాలు ఇలా ఉంటాయి:
కారణాలు
అంటువ్యాధులు
గర్భవతి అయిన తల్లి హానికరమైన రసాయనాలు తీసుకోవడం.
గర్భిణి తల్లి పొగ తాగడం, మద్యంపానం చేయడంవల్ల (పిండానికి హాని)
సామాజిక-జనాభా మరియు పర్యావరణ అంశాలు
ఇతర కారణాలు:
ఇది వరకే ఇంట్లో ఎవరికైన పుట్టుకతో గుండె సమస్యలు రావడం.
అలాగే తల్లిదండ్రుల అనారోగ్యాలు కూడా పుట్టుకతో వచ్చే గుండె లోపాలలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
ఈ పుట్టుకతో వచ్చే గుండె వ్యాధుల్ని ఎలా నిర్ధారణ చేసేది మరియు వీటికి చికిత్స ఏమిటి?
గర్భధారణ సమయంలో :
గర్భస్థ శిశువులో పుట్టుకతో వచ్చే గుండె లోపాలను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్లు సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో, గర్భస్థ శిశువులోని గుండెలోపాల్నీ పిండం యొక్క 20 వారాల వయసులోగానే గుర్తించవచ్చు.
గర్భస్థ శిశువులో పుట్టుకతో వచ్చే గుండె లోపాలను గుర్తించడంలో యాంటెనాటల్ (పిండం) ఎఖోకార్డియోగ్రఫీ కూడా ఉపయోగపడుతుంది.
బాల్యదశలో:
రోగ నిర్ధారణకు కింది పరీక్షలతో సహా రోగి యొక్క సంపూర్ణ వైద్య చరిత్ర మరియు భౌతిక పరీక్షలు అవసరం:
ఎలెక్ట్రో కార్డియోగ్రామ్ (ECG)
ఛాతీ ఎక్స్-రే
ఎఖోకార్డియోగ్రామ్
స్క్రీనింగ్ కోసం పల్స్ ఆక్సిమెట్రి
పుట్టుకతో వచ్చే గుండె లోపాలతో ఉన్న రోగులకు చేసే చికిత్స వారికున్న గుండె లోపం యొక్క తీవ్రతపై నిర్ణయించబడుతుంది. అట్టి పరిస్థితిలో కింది చర్యలుంటాయి:
గుండె జబ్బుల నిపుణుడి చే (కార్డియాక్ స్పెషలిస్ట్) ఎప్పటికప్పుడు తనిఖీలు
ప్రోఫీలాక్సిస్ తో పాటు ఎండోకార్డిటిస్ కి మందులు
గుండె లోపాల్ని సరి చేసేందుకు, (రంధ్రాలను) మూసివేయడం లేదా మరమ్మత్తు చేయడం కోసం ఇన్వెసివ్ శస్త్రచికిత్స.
అవగాహన పెంచుకొని, చిన్నపిల్లల్ని కాపాడవల్సిన బాధ్యత అందరిపై ఉంది.