ఘ‌ట్‌కేసర్ అభివృద్ధి చేసే ద‌మ్ము లేదా తెరాస‌కు : ‌కొమ్మిడి శివ‌ప్ర‌దీప్‌రెడ్డి

అధికారంలోకి వ‌చ్చి ఏడాది గ‌డిచిన తెరాస నాయ‌కుల‌కు ఘ‌ట్‌కేస‌ర్ ప‌ట్ట‌ణాన్ని అభివృద్ధి చేసే ద‌మ్ములేద‌ని విమ‌ర్శించారు మేడ్చ‌ల్ యువ‌జ‌న కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కొమ్మిడి శివ‌ప్ర‌దీప్‌రెడ్డి. ఎక్క‌డ వేసిన శిలాప‌ల‌కాలు అక్క‌డే ద‌ర్శన‌మిస్తున్నాయి కానీ ప‌నులు మాత్రం ఇంచు కూడా ముందుకు వెళ్ల‌డం లేద‌ని మండిపడ్డారు. అధికారంలోకి వ‌చ్చింది అభివృద్ధి చేయ‌డానికి కాల‌యాప‌న‌కా అని ప్ర‌శ్నించారు. ఘ‌ట్‌కేస‌ర్ పుర‌పాల‌క ప‌నుల‌న్ని ఎక్క‌డిక్క‌డే మురుగున ప‌డుతున్నాయ‌ని పేర్కొన్నారు.
దేవుడి పేరు మీద కాల‌యాప‌న
ప‌ట్ట‌ణంలోని ప్ర‌ధాన స‌మ‌స్య‌ను కూడా ప‌ట్టించుకోలేద‌న్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు స్థానిక మంత్రి చామకూరా మల్లారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరియు స్థానిక పెద్దలు సమక్షంలో బాలాజీ దేవాల‌య భూములను క్రమబద్ధీకరణ చేస్తామని మరియు ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ఇస్తామని హమీఇచ్చారు. కానీ ఇవి ఎలాంటి పురోగతిలేదు. దేవుడి పేరు మీద కాల‌యాప త‌ప్పా మ‌రోక‌టి లేద‌ని విమ‌ర్శించారు.
ఎన్ని ప్ర‌మాదాలు జ‌రిగాక ఫ్లైఓవ‌ర్ క‌డుతారు ?
తెరాస రాష్ట్రంలో, ఇక్క‌డ స్థానికంగా అధికారంలో ఉన్నా… ఏళ్లు గ‌డుస్తున్నా… రైల్వే వంతెన మాత్రం ఇంకా పూర్తి చేయ‌డం లేద‌ని ఇప్ప‌టికే ఇక్క‌డ అనేక ప్ర‌మ‌దాలు జ‌రిగాయ‌న్నారు. వంతెన నిర్మాణం కోసం, రోడ్డు వెడ‌ల్పు చేయ‌డానిక భూములు ఇచ్చిన వారు ప‌రిస్థితి అగ‌మ‌య్య గోచ‌రంగా త‌యారైంద‌న్నారు. త‌రుచూ ప్ర‌మ‌దాలు సంబ‌విస్తున్నా… ఇక్క‌డ మాత్రం వంతెన నిర్మాణం చేయ‌డానికి చేతులు ముందుకు రావ‌డం లేద‌న్నారు. ఇక గీతమందీర్ ఎదురుగా ఉన్నా అండర్ డ్రైనేజీ పనులకోసం పోయిన ఏడాది ( 16-12-2019 ) నాడు మంత్రి మాల్లారెడ్డి గారు శంకుస్థాపన చేశారు కాని ఇప్పటి వరకు ఎలాంటి పనుకు జరగలేదు. ఇదే విషయంపై ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్ వసంత గారికి వినతి పత్రాన్ని ( 28-12-2020 )ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకి స్పందించలేరన్నారు. అలాగే ఘట్కేసర్ లోని చిన్నచెరువులో మురికి నీరు కలవడం వల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఇలా తెరాస‌లాగా ఇక్క‌డ కలుషితం జ‌రిగితే ప్ర‌జ‌లు ఎలా జీవిస్తార‌ని ప్ర‌శ్నించారు.