తెరాసలో సీఎం అభ్యర్థి లేడా ఒక్క కేటీఆర్ ఉన్నాడా ?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇటీవల కాలంలో సీఎం మార్పు జరుగుతుందని సీఎంగా అతని కుమారుడు కేటీఆర్ సీఎం అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఉద్యమ పార్టీగా అధికారం చేపట్టిన తెరాసలో కేసీఆర్‌తో సమయంగా కాదు కాదు కేసీఆర్ కంటే ఎక్కువగా ఉద్యమం చేసిన వారు కూడా ఉన్నారు. కాగా ఉద్యమం వల్ల సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వేసిన ఎత్తుగడల ముందు మిగిత నేతల ఆలోచనలు పని చేయలేదు. చివరిగా గత ఆరు సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్కరే సీఎంగా కొనసాగుతున్నారు. కానీ ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణాలమాల వల్ల సీఎం మార్పు కూడా అతని కుమారుడికే పట్టం కట్టాలని చూస్తున్నారు. దానికి వత్తాసు పలుకుతూ పార్టీలో నేతలు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. నిజానికి తెరాస పార్టీలో సీఎం స్థాయి తగ్గ నేత ఎవరూ లేరా అనే ప్రశ్న ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.కేటీఆర్‌నే సీఎంను ఎందుకు చేయాలని సీనియర్ నేతల్లో తొలుస్తున్న ప్రశ్న.
కేటీఆర్ ఒక్కడేనా ?
రాజు వెళితే రాజకుమారుడు పట్టం చేపట్టాలా. ఇది ప్రజా స్వామ్యమా లేక రాజరీక పాలన అని తెరాస సీనియర్ నేతలు అంటున్నారు. పక్కపార్టీ నేతలు చెబితే కానీ పార్టీలో సీనియర్ నేతలు గుర్తుకు రావడం లేదా ?. ఇటీవల ఓ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న మాటలు దూమరం లేపుతున్నాయి. తెలంగాణకు దొరలే సీఎం కావాలా బలహీన వర్గాలను చెందిన వారు కాకుడదా, మంత్రి ఈటెల రాజేంద్ర ఎందుకు సీఎం కాకుడదూ అని వ్యాఖ్యనించారు. నిజనికి పార్టీలో నిబద్దతతో పనిచేసిన నాయకులు ఎవరైన ఉన్నారు అంటే అది ఒక్క ఈటెల అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అప్పుడు పెద్ద దూమారాన్నే లేపాయి. తెరాస నిజనానికి ఓ ఇంటి పార్టీ కాదు. అందులో చాలా మంది నేతలు ఉన్నారు.
ఇది ఇలా ఉంటే పాత సచివాలయం భవనంలో అప్పడు పౌరసరఫరాల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న ఈటెల తన సీఎం కావాలని చెప్పకనే చెప్పారు ఓ సందర్భంలో…
ఒక రోజు మీడిమా మిత్రులతో తన ఛాంబర్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ… చెమట వాసన తెలిసినొన్ని… అన్ని పదవులు అనుభవించా… టార్గెట్ పెద్ద కూర్చీనే అని అన్నారు. ఆ రోజు ఆయన ఎందుకు అలా అన్నారో అని ఇప్పుడు అర్ధం అవుతోంది.
ఇప్పటికే భాజపా సెగ అంటుకొని పార్టీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది. తాజాగా కూతరుకి ఎమ్మెల్సీ ఇవ్వడం… త్వరలో మంత్రిని చేస్తారని, కేటీఆర్‌ని సీఎంగా చేస్తారని. నిజానికి ఇవి జరిగితే మాత్రం చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడే అవకాశం ఉంది. ఇంకా ఎన్నాళ్లు దొర కాళ్ల దగ్గర బతకాలి తమకంటూ స్వేచ్చ లేదా అనే దొరణిలో ఉన్నారు కొంతమంది. వాస్తావనికి సీఎంగా కేటీఆర్ అర్హుడు అనే ప్రశ్ర ఉత్పన్నమైంది ఇప్పుడు. పార్టీ కోసం ఈటెల వంటి సీనియర్లు పని చేస్తే… ఫలాలను ఆ ఒక్క కుటుంబమే ఎందుకు తినాలి అని పార్టీలో సీనియర్ నేతలు ప్రశ్నించుకుంటున్నారు.
ఏది ఏమైనా… వచ్చె నెలలో రాజకీయ మార్పులు ఉంటే… పెద్ద దుమారం లేపేటట్టు ఉన్నాయి.