చిన్నశంకరంపేటలో పులుల సంచారం
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో పులల సంచారం బంయదోళన కలిగిస్తోంది. గతంలో ఇప్పటికే చిన్నశంకరంపేట మండలం కామరాం అటవీ ప్రాంతంలో పులలు సంచరించాయి. తాజాగా ఒక పులి తిరుగుతుందన్న సమాచాన్ని స్థానిక గ్రామ ప్రజలు గుర్తించారు. అయితే అది ఒక పులి కాదని దానితో పాటు మూడు పులులు సంచరిస్తున్నాయని గ్రామ ప్రజలు అధికారులు సమచారం ఇచ్చారు. కాగా అటవీ శాఖ అధికారులు మాత్రం స్పదించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులు, గొర్రెలు, మేకలు తీసుకొని అటవీ ప్రాంతానికి వెళ్లడం అలాగే రాత్రి పూట రైతులు పోలాల దగ్గరికి వెళ్తుంటారు. దీంతో పులి ఏసమయంలో దాడి చేస్తుందో అని భయంలో స్థానిక ప్రజలు భయపడుతున్నారు. తక్షణమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.